పది కిలోల బండరాయితో..నుజ్జు నుజ్జై తల
భూ సెటిల్మెంట్ల వివాదమే ప్రాణం తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో ఓ జిమ్ కోచ్ ను అత్యంత దారుణంగా హతమార్చారు. పరవాడ మండలం లంకెలపాలెం పరిధిలోని శ్రీరామనగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు (40) అనే జిమ్ కోచ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తల పగులగొట్టి అత్యంత కిరాతకంగా హతమార్చారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన వివరాలు:
మృతుడు వెంకినాయుడు కూర్మన్నపాలెంలోని ఒక జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తూ, భూ సెటిల్మెంట్లు కూడా చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం పెద్దినాయుడుపాలెంలో నివసిస్తుండగా, వెంకినాయుడు మాత్రం కొంతకాలంగా శ్రీరామనగర్ కాలనీలో సరస్వతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని ఇంట్లో పడుకున్న వెంకినాయుడును, అర్ధరాత్రి 1 గంట సమయంలో 'తేజ' అనే వ్యక్తి బయటకు పిలిచాడు. ఏదో పని మీద వెళ్తున్నారని భావించిన సరస్వతి తిరిగి నిద్రపోయింది. అయితే తెల్లవారుజామున సమీపంలోని ఒక లేఅవుట్‌లో వెంకినాయుడు రక్తపు మడుగులో శవమై కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసుల విచారణ:
సమాచారం అందుకున్న పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. పది కిలోల బరువున్న బండరాయితో తలపై బలంగా మోదడంతో వెంకినాయుడు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటాన్ని బట్టి, హత్యకు ముందు పెనుగులాట జరిగినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు భూ సెటిల్మెంట్ల వివాదాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
Next Story