రాజమండ్రిలో పోలీసులపై నకిలీ నోట్ల గ్యాంగ్‌ అటాక్‌
x

రాజమండ్రిలో పోలీసులపై నకిలీ నోట్ల గ్యాంగ్‌ అటాక్‌

పుష్పా 3 తలపించే విధంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు దుండగులు.


ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులపై ఓ గ్యాంగ్‌ అటాక్‌ చేసింది. పోలీసులపై నకిలీ నోట్ల గ్యాంగ్‌ అటాక్‌ చేసిన ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఛేజింగ్‌.. ఫైటింగ్‌ సీన్లతో మరో పుష్ప 3 సినిమాను తలపించింది. బరితెగించిన ఈ ముఠా ఏకంగా నకిలీ నోట్ల డాన్‌ను విడిపించుకుపోయింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్టలం నుంచి రాజాం వైపు బైకులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను జీ సిగడం పోలీసులు పెద్ద పెనశం గ్రామంలో తనిఖీ చేయగా రూ.15లక్షల నకిలీ నోట్లు దొరికాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు గుట్టు వెలుగు చూసింది. ఒడిశా సరిహద్దులోని మెలియపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో నకిలీ నోట్ల ప్రింటింగ్‌ వ్యవహారం వెలుగుచూసింది. వెంటనే పోలీసులు దాడి చేసి రూ. 57లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. ఈ నకిలీ నోట్ల డాన్‌ రాజమండ్రిలో ఉన్నట్టు సమాచారం లభించింది. వెంటనే శ్రీకాకుళం పోలీసులు రాజమండ్రి చేరుకున్నారు. నకిలీనోట్ల డాన్‌ను భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భద్రత మధ్య శ్రీకాకుళం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో పోలీస్‌ వాహనాన్ని రెండు కార్లు.. నాలుగు ద్విచక్ర వాహనాలతో దొంగ నోట్ల ముఠా వెంబడించింది. రాజమండ్రి సమీపంలోని వీఎల్‌ పురం వద్ద పోలీసులపై అటాక్‌ చేసింది. పోలీసు వాహనంలోని డాన్‌ను విడిపించుకుని ఈ ముఠా దర్జాగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఏపీ పోలీసుల్లో అలజడి మొదలైంది.

Read More
Next Story