మాజీ మంత్రి విడదల రజిని లంచం తీసుకున్నారు...
x

మాజీ మంత్రి విడదల రజిని లంచం తీసుకున్నారు...

వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విడదల రజిని రూ. 2కోట్లు లంచంగా తీసుకున్నారని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. తదుపరి చర్యలు ఏమిటనే చర్చ జరుగుతోంది.


మాజీ మంత్రి విడదల రజిని అవినీతి కేసులో ఇరుకున్నారు. స్టోన్ క్రషర్స్ వారి నుంచి లంచాలు తీసుకున్నారని రుజువైంది. దీంతో కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేరుగా హోం మంత్రిని కలిసి పలువురు రజిని పైన ఫిర్యాదులు చేసారు. అందులో కొందరు పోలీసు అధికారులు కూడా భాగస్వాములు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు తాజాగా రజిని అక్రమాలకు పాల్పడిందని నిర్థారించారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం తో ప్రజల్లో చర్చనియాంశంగా మారింది.

రజిని రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ అందుకు సహక రించిన వారి పేర్లను వెల్లడించింది. పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారులను రజిని బెదిరింపులకు గురి చేసారనే ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ చేసింది. రజిని 2019 లో వైఎస్సార్ సీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. మంత్రిగా ఉంటూ పలువురి నుంచి అక్రమ వసూళ్లు చేసారనే ఆరోపణలు వచ్చాయి.

చిలుకలూరిపేట పరిధిలోని స్టోర్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి వసూళ్లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే రూ. 50 కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుందని రజిని పీఏ బెదిరించినట్లు సమాచారం. దాంతో ఆ వ్యాపారులు రాజీకి వచ్చారు. వారిని పోలీసు అధికారి జాషువా బెదిరించినట్లు ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఆ తరువాత వ్యాపారుల నుంచి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసారు. ఇందులో రెండు కోట్లు రజినీకి అందినట్లు విజిలెన్స్ విచారణలో తేల్చారు. మరో పది లక్షలు పోలీసు అధికారి జాషువా తీసుకున్నట్లుగా విజిలెన్స్ నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Read More
Next Story