రాహూల్ గాంధీ హత్యకు కుట్ర ?
x

రాహూల్ గాంధీ హత్యకు కుట్ర ?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ హత్యకు కుట్ర జరిగిందా ? కుట్ర కూడా బీజేపీ నేతల నుండే జరుగుతోందా ? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ హత్యకు కుట్ర జరిగిందా ? కుట్ర కూడా బీజేపీ నేతల నుండే జరుగుతోందా ? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రాహూల్ తొందరలోనే వాళ్ళ నాన్నమ్మ ఇందిరాగాంధీ లాగ హతమైపోతాడని బీజేపీ సీనియర్ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని గాంధీభవన్తో పాటు బీజేపీ కార్యాలయం దగ్గర కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించాయి. రాహూల్ గాంధీ ఒక టెర్రరిస్టని, ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహూల్ కూడా పడుతుందని బన్వీందర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహూల్ ను ఉగ్రవాదిగా పేర్కొటు ఎన్డీయే మిత్రపక్షాల నేతలు కొందరు పదేపదే ఆరోపణలు చేస్తున్నారంటు కాంగ్రెస్ నేతలు మండిపోయారు.

ఎన్డీయే మిత్రపక్షాల నేతల ఆరోపణలు, వ్యాఖ్యల నేపధ్యంలోనే రాహూల్ ను హత్య చేస్తామంటు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈనెల 11వ తేదీన రాహూల్ నాలుకను తెచ్చిన వారికి రు. 11 లక్షలు బహుమానంగా ఇస్తానని మహారాష్ట్రలోని బుల్దానా శివసేన ఎంఎల్ఏ సంజయ్ గైక్వాడ్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. రాహూల్ పై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతు జనాలను రెచ్చగొడుతున్న తన్వీందర్ సింగ్, గైక్వాడ్ లాంటి వాళ్ళపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఇక్కడి కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.

రాహూల్ ను టెర్రరిస్టు అనటమే కాకుండా నాన్నమ్మ ఇందిరాగాంధీ లాగే తొందరలోనే హతమైపోతాడని తన్వీందర్ చేసిన వ్యాఖ్యల విషయంలోనే కాంగ్రెస్ నేతలు బాగా ఆందోళన చెందుతున్నారు. ఇందిరాగాంధీ లాగే హతమైపోతారంటే ఇప్పటికే రాహూల్ హత్యకు బీజేపీ నేతలు కుట్రలు చేశారని కాంగ్రెస్ నేతలు గోలగోల చేస్తున్నారు. నోటిని అదుపులోకి పెట్టుకోకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో అనేందుకు తన్వీందర్ సింగ్, గైక్వాడ్ లాంటి నేతల నోటిదురుసే తాజా ఉదాహరణ.

Read More
Next Story