
నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు
గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రూ.84 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అక్కరలేదని ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు.సముద్రంలోకి పోయే వృథా జలాలపై కూడా బనకచర్ల కు అనుమతులు లేవని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.నెల్లూరులో ఆనం మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక, హంద్రీ-నీవా ప్రాజెక్టుని పక్కన పడేస్తే, కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. చివరి వరకు నీటిని అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు ఆయా ప్రదేశాలకు సందర్శించనున్నారని పేర్కొన్నారు. సోమశిల నుంచి 18750 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుందని, ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 TMCల నీటిని నిల్వచేస్తామని ఆయన చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వం సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం 12వేల క్యూసెక్కుల నుంచి 24 వేలకి పెంచుతామని చెప్పిందని మంత్రి ఆనం గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ ఆలోచన లేకుండా కమిషన్ల కోసం టెండర్లు పిలిచారని ఆరోపించారు. సోమశిల హైలెవల్ కెనాల్ కోసం అవసరమైన భూసేకరణ కోసం సీఎం చంద్రబాబు నిధులిచ్చారని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నాయని మంత్రి ఆనం వెల్లడించారు.
Next Story