కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా.. కేంద్ర మాజీ మంత్రికి అవకాశం..
x

కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా.. కేంద్ర మాజీ మంత్రికి అవకాశం..

అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి కూడా బరిలోకి దిగనున్నారు.


ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం ప్రచారంలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తాజాగా పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను కూడా పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో 12 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది. అంతేకాకుండా వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన అభ్యర్థులను పార్టీ హైకమాండ్ ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. వారికి ఆశించిన చోటు నుంచే అవకాశం ఇచ్చారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమె రానున్న ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేయనున్నారు. అదే విధంగా ఇటీవల వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మారిన ఎంఎస్ బాబు.. పూతలపట్టు నుంచే బరిలోకి దిగనున్నారు.

కాంగ్రెస్ ఎంపీ సభ్యులు

విశాఖపట్నం - సత్యనారాయణ రెడ్డి

నరసరావుపేట- అలెగ్జాండర్ సుధాకర్

నెల్లూరు- కొప్పుల రాజు

తిరుపతి- చింతా మోహన్

ఏలూరు- కావూరి లావణ్య

అనకాపల్లి- వేగి వెంకటేష్

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు

గాజువాక - లక్కరాజు రామారావు

అరకు వ్యాలీ - శెట్టి గంగాధరస్వామి

విశాఖ దక్షిణం- వాసుపల్లి సంతోష్

భీమిలి - అడ్డాల వెంకట వర్మ రాజు

గంగాధర నెల్లూరు - డి. రమేష్ బాబు

ఎర్రగొండపాలెం- డా. బి. అజితా రావు

పూతలపట్టు - ఎం.ఎస్. బాబు

సంతనూతలపాడు- విజేష్ రాజు పాలపర్తి

టెక్కలి- కిల్లి కృపారాణి

గోపాలపురం - ఎస్. మార్టిన్ లూథర్

పర్చూరు - నల్ల గొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి

నర్సీపట్నం - శ్రీరామమూర్తి

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

Read More
Next Story