సురవరంకు సంతాపం..ప్రకాశంకు నివాళులు
x

సురవరంకు సంతాపం..ప్రకాశంకు నివాళులు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.


కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ అగ్రనేత, మాజీ పార్లమెంట్‌ సభ్యులు సురవరం సుధాకర్‌రెడ్డి మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యల గురించి నిత్యం పోరాటం చేసిన గొప్ప ప్రజా నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని, సమకాలీన నాయకుడిగా ఆయన కలిసి పని చేసిన రోజులు గుర్తొస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు, విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు. రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి సువరం సుధాకర్‌రెడ్డి చేసిన కృషి చరిత్రలో గుర్తొండి పోతుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. నాటి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారిలో స్వాతంత్య్ర ఉద్యమ కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
భాతరదేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన గొప్ప యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తుది శ్వాస వరకు ప్రజల కోసమే జీవించిన మహా నాయకుడని కొనియాడారు. ఆ మేరకు ఇరువు శనివారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

Read More
Next Story