విశాఖకు గూగుల్ ఊరికే రాలే...
x

విశాఖకు గూగుల్ ఊరికే రాలే...

బోలెడు ఆశపెడితే, బోలేడు ఆపర్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది... అక్టోబర్ 14న ఒప్పందం మీద సంతకాలు


ఒక భారీ డేటా సెంటర్‌ ((1 Gigawatt hyperscale data centre campus)ను ఏర్పాటు విశాఖ పట్టణంలో ఏర్పాటు చేసేందుకు గూగుల్‌ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అందమైన ప్రదేశమని, అందులో విశాఖ ఒక చక్కటి చల్లని మూల అని, అక్కడ సముద్రం, అలల సవ్వడి వీనుల విందుగా ఉంటాయని, అక్కడి ప్రజలు గొప్పవారని గూగుల్ విశాఖకు రావడం లేదు.

విశాఖకు పట్టణానికి వచ్చి అక్కడొక డేటా సెంటర్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశచూపాల్సి వచ్చింది. గూగుల్ కాలుమోపితే చాలు ఆ నేల బంగారమువుతందనే భ్రమ ఉండటంలోఅత్యాధునిక, అంత్యంత భారీ డేటా సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్‌ ను రప్పించాల్సి వచ్చింది. ఏమయిన గూగుల్ రాష్ట్రానికి రావడం శుభసూచకమనే భావన సర్వత్రా ఉంది.

ఒక గీగా వాట్ (1-GW data centre) సామర్థ్యం ఉన్న భారీ డేట్ సెంటర్ క్లస్టర్ ఇది.దీనికి అక్టోబర్ 14న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోబోతున్నది. భారతదేశంలో గూగుల్ చేయబోతున్న అతి పెద్ద విదేశీ ఇన్వెస్ట్ మెంటు కూడా ఇదే. ఈ ఒప్పందం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటెల్ ఈ ఒప్పందం మీద సంతకాలు చేయబోతున్నారు.

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం అంచలంచెలుగా రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్న ఈ డేటా సెంటర్ నుంచి ఒక అయిదారేళ్లలో విశాఖలో 88 వేల ఉద్యోగాలు లభిస్థాయి. ఇదే నిజమయితే గూగుల్ కు ఇచ్చిన రాయితీలు సమర్థనీయమే. డేటా సెంటర్ల ద్వారా అన్నివేల ఉద్యోగాలు వస్తాయా అనేది చర్చనీయాంశం.

ఎందుకుంటే ప్రపంచంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన ఏ డేటా సెంబర్ లో కూడా వేయి మించి ఉద్యోగాలు లేవని గూగుల్ వెబ్ సైట్లే చెబుతున్నాయి. గూగుల్ రైడెన్ డేటా సెంబర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే చర్చ పక్కన బెడితే, ఈ సంస్థకు ఇచ్చిన రాయితీలు ఇవే.

* మీడియ సమాచారం ప్రకారం ఈ సంస్థకు ఆఫర్ చేసిన మొత్తం రాయితీల విలువ రూ.22,002 కోట్లు.

*ఈ డేటా సెంటర్‌కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయించింది. ఈ భూముల విలువలో 25 శాతం రాయితీ ఇస్తారు. ఇది కాకుండా మరొక 15 ఎకరాలు ల్యాండింగ్‌ కేబుల్‌ స్టేషన్‌కు కేటాయించింది. ఈ భూములకు స్టాంపు డ్యూటీ 100 శాతం మినహాయింపు ఉంటుంది.

*ప్లాంటు మినషనరీ ఖర్చులో 10 శాతం మూలధన రాయతీ కింద పదేళ్లలో గరిష్ఠంగా రూ 2,129 కోట్లు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

* జీపీజీడబ్ల్యూ (GPGW) ఫైబర్‌ యాక్సెస్‌ కోసం చేసే ఖర్చులో 30శాతం మొత్తాన్ని 20ఏళ్లలో ప్రభుత్వ చెల్లిస్తుంది. ఆపరేషన్‌ యాజమాన్య నిర్వహణ చార్జీలు ప్రతి మూడేళ్లకు 5శాతం చొప్పున పెంచుతూ రూ 282 కోట్లు చెల్లిస్తుంది.

*డేటా సెంటర్‌ నిర్మాణం కోసం రూ.2,245 కోట్ల జీఎస్టీకి మినహాయింపు

*ఐదేళ్ల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తారు. దీని విలువ రూ.1745 కోట్లు. నీటి చార్జీపై పదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.

ఈ ఇన్వెస్టు మెంటు వెనక ఒక ఏడాది చరిత్ర ఉంది

గత ఏడాది అక్టోబర్ లో ఐటి మంత్రి నారా లోకేష్ అమెరికా సందర్శించినపుడు గూగుల్ తో చర్చలు మొదలుపెట్టారు. వాటి ఫర్యవసానామే ఇది.





Read More
Next Story