SPS అధికారులకు IPS అధికారులుగా ప్రమోషన్ కోసం కమిటీ
x
AP DGP Office

SPS అధికారులకు IPS అధికారులుగా ప్రమోషన్ కోసం కమిటీ

స్టేట్ పోలీస్ సర్వీస్ అధికారులను ఐపీఎస్ అధికారులుగా ప్రమోట్ చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.


ఐపీఎస్ అధికారుల నియామకాలకు సంబంధించిన ప్రమోషన్ 1955 ఐపీఎస్ రెగ్యులేషన్స్‌లోని నిబంధనల ప్రకారం 2024 సంవత్సరానికి సెలెక్ట్ లిస్ట్ సిద్ధం చేయడానికి ఎంపిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SC-C) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వు సంఖ్య G.O.Rt.No.1297 తేదీ: 09-07-2025 విడుదల చేసింది. ఈ కమిటీలో కీలక సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె విజయనంద్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరిష్ కుమార్ గుప్తా ఉన్నారు.


ఈ ఎంపిక కమిటీలో యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇండియన్ గవర్నమెంట్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. ఈ కమిటీ 2024 సంవత్సరానికి SPS (State Police Service) అధికారులను IPS ఏపీ క్యాడర్‌కు ప్రమోషన్ కోసం సెలెక్ట్ లిస్ట్ సిద్ధం చేయనుంది. ఈ ఉత్తర్వులు గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జారీ చేశారు.

Read More
Next Story