కలెక్టర్లూ మీరే నా టీమ్‌–సీఎం అంటే కామన్‌ మ్యాన్‌
x

కలెక్టర్లూ మీరే నా టీమ్‌–సీఎం అంటే కామన్‌ మ్యాన్‌

అన్నింటికీ రూల్స్‌ కాదు... మానవీయ కోణంలో పనిచేయండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.


కలెక్టర్లూ మీరే నా టీమ్‌ అని, మీరు మంచిగా పని చేస్తే తనకు, తన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని మీరు కూడా అదే పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమర్థవంతమైన పాలన అందించే విషయంలో వారికి దిశా నిర్థేశం చేశారు. 360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి మీకు కలెక్టర్లుగా అవకాశం ఇచ్చాను... నా ఆలోచనలు, అంచనాలు అందుకోండి... బెస్ట్‌ పెర్మార్మెన్స్‌ ఇవ్వండి అని సిఎం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండండి.. నిత్యం వారితో మమేకం అవ్వండి... అన్నింటికీ రూల్స్‌ కాదు... మానవీయ కోణంలో పనిచేయండి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సిఎం సూచించారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి
కలెక్టర్లుగా పోస్టింగులు ఇస్తున్న సందర్భంగా సిఎం మాట్లాడుతూ నేను 1995లో మొదటి సారి సిఎం అయ్యాను. 30 ఏళ్లలో 15 ఏళ్లు సిఎంగా ఉన్నాను. ఎంతో మంది అధికారులను నియమించాను. చాలా మందితో పనిచేయించుకున్నాను. అయితే ఈ సారి కలెక్టర్లకు పోస్టింగ్‌ ల విషయంలో మరింత గట్టి కసరత్తు నిర్వహించాను. గతంలో ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. దీనికి కారణం ఉంది. అనేక సమస్యల మధ్య ఏడాది క్రితం మనం పాలన ప్రారంభించాం. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. వీటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కలెక్టర్లే కీలకం. మీ పనితీరే ప్రభుత్వానికి విజయాలను తెచ్చి పెడుతుంది. 1995లో తొలి సారి సిఎంగా ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండేవాడిని. ఫైల్స్‌ క్లియరెన్స్‌ వంటి కార్యక్రమాలతో అధికారులను పరుగులు పెట్టించే వాడిని. పని విషయంలో ఎక్కడా రాజీ ఉండేది కాదు. ఆ పనితీరు అధికారులకు, ఉద్యోగులకు కొంత కష్టంగా అనిపించినా ప్రగతిలో మార్పు కనిపించింది. అభివృద్ది వేగవంతం అయ్యింది. అదొక్కటే కాదు... ఎప్పుడు విపత్తు ఉన్నా అధికారులకంటే ముందు నేను వెళ్లే వాడిని... తుఫాన్లు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ముందు నేనే వెళ్లే వాడిని. విశాఖలో హుద్‌ హుద్‌ సమయంలో ఫ్లైట్‌ కూడా వెళ్లని పరిస్థితుల్లో ముందుగా వెళ్లి 10 రోజులు అక్కడే ఉన్నాను. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఆందోళన పోతుంది. ప్రభుత్వం సాయం చేస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. స్పందించే ప్రభుత్వంగా అంతా గుర్తిస్తారు. అధికారంలో రిస్క్‌ ఉంటుంది. లీడర్స్‌ అనే వాళ్లు రిస్క్‌ తీసుకోవాలి అప్పుడే ఫలితాలు వస్తాయి. ఫ్యాక్షన్, నక్సలిజం, మత ఘర్షణల విషయంలో సమర్థులైన అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేయించాను. దీంతో ఫలితాలు వచ్చాయి. అధికారుల సహకారం, సమన్వయం, మంచి టీంతోనే నేను ఫలితాలు సాధించాను అని చంద్రబాబు నాయుడు అన్నారు
మీరే నాం టీమ్‌
కలెక్టర్‌ గా పనిచేయడం అంటే మీకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మంచి అవకాశం కలెక్టర్‌ ఉద్యోగం. మీరు క్షేత్ర స్థాయిలో పనిచేస్తే ప్రతిదానిలో మార్పు చూపించవచ్చు. సాంఘీక సంక్షేమ హాస్టల్‌ కు వెళ్లి వసతులు చూడండి. ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో మీరే కీలకం. నాడు హైదరాబాద్‌ లో ఒక అధికారి ఉండే వారు... ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చాను. దీంతో ల్యాండ్‌ మాఫియాకు చెక్‌ పెట్టారు. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపారు. ఒక తాహసీల్దారు బదిలీ అయితే కొత్తగా వచ్చే వాళ్లు.... ల్యాండ్‌ రికార్డులు అప్పగించడమే కాదు....క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రభుత్వ ఆస్తులు చూపించి వాటి రక్షణ అంశాలు వివరించి బాధ్యతలు అప్పగించే వారు. ఆ స్థాయిలో పనిచేశాం కాబట్టే నాడు ఫలితాలు చూపించాం. కలెక్టర్లుగా మీరు బాధ్యతగా, పారదర్శకంగా ఉంటే... మీ కింది అధికారులు కూడా వాటిని పాటిస్తారు. మీరు వారిలో స్ఫూర్తి నింపాలి. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న అవకాశాల్లో మీరే బెస్ట్‌ ఆప్షన్స్‌ అని సెలక్ట్‌ చేశాను, మీరు బెస్ట్‌ ఫెర్మామెన్స్‌ చూపాలి. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్న నా టీం మీరే. పనిచేస్తే ప్రోత్సహిస్తా.....ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం క్యారీ చెయ్యను. ఇదే సమయంలో నేను పొలిటికల్‌ గవర్నెన్స్‌ అని చెపుతున్నా. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూడండి...ప్రజలకు ఉపయోగపడేది అయితే మానవీయ కోణంలో పనిచేయండి. నేను తప్పు చేయమని చెప్పను. పొలిటికల్‌ గవర్నెన్స్‌ అంటే తప్పు చేయమని కాదు. కలిసి పనిచేయమని. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం వారికి ఇవ్వండి. పొలిటికల్‌ గవర్నెన్స్‌ చేసిన సమయంలో నేను ఓడిపోలేదు... ఎక్కువ బ్యూరో క్రటిక్‌ గవర్నెన్స్‌ చేసినప్పుడే రాజకీయంగా నష్టపోయాను అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇతర జిల్లాలతో పోటీ పడండి
మీ నిర్ణయాలు క్రియేటివ్‌ గా, ఇన్నోవేటివ్‌ గా ఉండాలి... కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి... ప్రతి దానికీ డబ్బులు లేవు అని కూర్చుంటే పని అవ్వదు. నేను అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నెంబర్‌ 1 గా ఉండాలి అని అందరితో పోటీ పడుతుంటా.... మీరు కూడా అన్ని జిల్లాల కంటే ముందు ఉండాలని ఇతర జిల్లాలతో పోటీ పడాలి. ముందుండాలి అనే కసి, పట్టుదల మీకు కనిపించాలి. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్‌ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్‌ అవర్‌ లోనే మీరు రెస్పాండ్‌ అవ్వాలి. మనం చేసేది ప్రజల్లోకి వెళ్లాలి.... లేకపోతే అసత్యాలే నిజం అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కలెక్టర్‌ అనేది అధికారం కాదు. అహంకారం, ఈగోలు వద్దు.... కామన్‌ మ్యాన్‌ గా ఉండాలి అని సిఎం అన్నారు.
Read More
Next Story