మేనిఫెస్టో ప్రకటించిన జగన్.. విద్యార్థులకు ప్రాధాన్యత!
x

మేనిఫెస్టో ప్రకటించిన జగన్.. విద్యార్థులకు ప్రాధాన్యత!

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం, వైసీపీ సుప్రీమో జగన్మోహన్ రెడ్డి.. మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉపాధి అవకాశాలకే పెద్దపీట వేస్తామని వెల్లడించారు.


తమ మేనిఫెస్టోలో విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన రెండు పేజీల వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను నెరవేర్చామని, కానీ ఈసారి 100 శాతం అమలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టోను తాము పవిత్ర గ్రంథాలైన బైబిల్, ఖురాన్, భగవద్గీతలా నమ్ముతామని, అదే విధంగా ఆచరణలో కూడా పెడతామని ఆయన భరోసా కల్పించారు. కేవలం వైసీపీ మేనిఫిస్టోలోనే అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, మహిళలు, కార్మికులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇతర పార్టీల్లో కాదు వైసీపీ

వైసీపీ ఎప్పుడూ ఇతర పార్టీల మాదిరిగా అమలు యోగ్యం కానటువంటి హామీలను చెప్పడానికి బాగున్నాయని ప్రకటించేయదని, ప్రజలకు సంక్షేమం వస్తుందా లేదా? సదరు హామీని తాము ఎంత వరకు అమలు చేయగలం అన్నటువంటి అన్ని విషయాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ఒక హామీని మేనిఫెస్టోలోకి చేర్చడం జరుగుతుందని సీఎం జగన్ తన ప్రసంగంలో వివరించారు. అందుకే 2019లో కూడా ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను నెరవేర్చామని, మరే ఇతర పార్టీ ఇప్పటివరకు ఇంతటి సక్సెస్ రేట్ సాధించలేదని గుర్తు చేశారు.

వాటిపైనే స్పెషల్ ఫోకస్

అదే విధంగా ఇప్పుడు ప్రవేశపెడుతున్న మేనిఫెస్టోలో ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలని అదే విధంగా కొనసాగిస్తామని జగన్ వివరించారు. కాకపోతే ఆయా పథకాలకు కేటాయిస్తున్న నిధులను పెంచుతామని చెప్పారు. ‘‘అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టోను రూపొందించాం. యువతకు ఉపాధి అవకాశాలు అందించడంపై వైసీపీ ఈసారి మరింత స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఆ దిశగా అనేక ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాము. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాటన్నింటిని అమల్లోకి తీసుకొస్తాం’’అని చెప్పారు జగన్.

మేనిఫెస్టోలో లేకపోయినా అమలు

అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో లేని పలు అంశాలను కూడా అమలు చేస్తామని జగన్ భరోసా కల్పించారు. ‘‘ప్రజలను మభ్యపెట్టడానికి అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాలం గడపడం అనవసరం. అందుకే మేము ఆ రూట్‌లో వెళ్లం. అమలు చేయగలం అన్న నమ్మకం ఉన్న పథకాలే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. వాటిని తప్పకుండా అమలు చేస్తాం. అదే విధంగా ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తాం’’ అని ఆయన వివరించారు.

మేనిఫెస్టోలోని హామీలివే

రెండు విడతల్లో పింఛన్‌ను రూ.3500 వరకూ పెంచుతాం. (2028లో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం)

వైఎస్ఆర్ చేయూత పథకాన్ని నాలుగు విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1 లక్షా 50 వేలకు పెంచుతాం

అమ్మఒడి పథకం రెండు వేల రూపాయలు పెంచుతాం. రూ.17వేలు అందిస్తాం. తల్లులకు చేతికి రూ.15000 ఇస్తాం.

అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత పథకాలను కొనసాగిస్తాం.

ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరిస్తాం.

నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తంను రూ.45 వేల నుంచి రూ.1.05వేలకు పెంచుతాం.

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తాం. దాన్ని కూడా నాలుగు విడతల్లో రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచుతాం.

వైఎస్ఆర్ రైతు భరోసాను రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతాం. కౌలు రైతులకు కూడా భరోసా వర్తించేలా చేస్తాం.

వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం అందిస్తాం.

మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేల అందిస్తాం.

వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 నుంచి రూ.లక్షకు పెంచుతాం.

లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తించేలా చేస్తాం.

ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ అందిస్తాం. తద్వారా వచ్చే ఐదేళ్లలో ఆటోలకు, ట్యాక్సీలకు రూ.50వేల అందిస్తాం.

చేనేతలకు సంవత్సరానికి రూ.24వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందిస్తాం.

వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తాం.

అర్హులై ఇళ్ల స్థలాలు లేనివారికి ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కొనసాగిస్తాం.

నాడు-నేడు కింద ట్యాప్‌ల పంపిణీని కూడా కొనసాగిస్తాం.

ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, ప్రతి జిల్లాకి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని నిర్మిస్తాం. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని సిద్ధం చేస్తాం.

స్విగ్గీ, జొమాటా వంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి వైఎస్ఆర్ బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటాం.

లా నేస్తంను కూడా కొనసాగిస్తాం.

Read More
Next Story