
సండే పూట సీఐఐ సదస్సుపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
గ్లోబల్ టెక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ను లక్ష్యంగా విశాఖలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2025) పై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమావేసంలో విస్తృత చర్చ జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, పెట్టుబడులు ఆకర్షించడం, టెక్నాలజీ అభివృద్ధి, గ్లోబల్ ట్రేడ్‌ను ప్రోత్సహించడంపై కేంద్రంగా చర్చించారు. సదస్సు చైర్మన్‌గా కేంద్ర మంత్రి పియూష్ గోయల్, కో-చైర్మన్‌గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది ఆంధ్రలో జరగనున్న న లుగో సదస్సు. మునుపటి మూడు 2016-18లో విశాఖలోనే జగిరాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక వేత్తలకు విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకర్లను కూడా ఆహ్వానించాలని సీఎం సూచించారు. ప్రధానమంత్రి మోదీని కూడా చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు.
సదస్సు లక్ష్యాలు:
కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా, నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సును వేదిక చేయాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను (గ్లోబల్ టెక్ ట్రాన్స్‌ఫర్మేషన్) అందిపుచ్చుకుని, అవకాశాలు సృష్టించేలా సదస్సు నిర్వహణ ఉండాలని సూచించారు. విశాఖను అందంగా తయారు చేయాలని, గ్లోబల్ సహకారం, మాన్యుఫాక్చరింగ్, మానవ వనరుల అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్ 2047పై దృష్టి పెట్టాలని చెప్పారు.