ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
x

ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

ఉగాది పండగ రోజున సీఎం జగన్ దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చెప్పారు.



ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ‌మోహన్ రెడ్డి ఉగాడి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శావల్యాపురం మండటం గంటావారిపాలెం దగ్గరని క్యాంపులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆశీర్వచనాల అనంతరం సీఎం దంపతులకు పండితులు ఉగాది పచ్చడి ఇచ్చి, శాలువా కప్పి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. అయితే ఉగాది పండగల సందర్భంగా జగన్.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


‘‘క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నా. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడాలని, పంటలు పచ్చగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారికి లాభాలు రావాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇళ్లూ కళకళలాడాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి’’అని ఆకాంక్షించారు సీఎం జగన్.


Read More
Next Story