సీఎం చంద్రబాబు నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో టూర్‌
x

సీఎం చంద్రబాబు నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో టూర్‌

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు విజయగనరం జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అమరావతిలో ఉంటూ సమీక్షలు చేస్తూ, మధ్యలో ఢిల్లీ టూర్లు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. దీపం 2.0 కింద ఉచిత గ్యాస్‌ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ప్రారంభించిన ఆయన రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లాలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

రెండో రోజు ఉత్తరాంధ్ర టూర్‌ కొనసాగింపులో భాగంగా శనివారం విజయనగరం జిల్లాతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన చేయాలని నిర్ణయించారు. అయితే విజయనగరం టూర్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా సీఎం విజయనగరం జిల్లా పర్యటన రద్దయినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. దీంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మాత్రమే శనివారం సీఎం టూర్‌ చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11:15 గంటలకు హెలికాప్టర్‌లో చింతలగోరువానిపాలెంలోని లారస్‌ సంస్థ వద్దకు వెళ్లనున్నారు. ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:2 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంకు చేరుకుంటారు. అక్కడ రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్‌లో రుషికొండ వెళ్లనున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ టూరిజమ్‌ రిసార్ట్స్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్‌లో అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Read More
Next Story