ఈ రోజంతా ప్రకాశం జిల్లాలోనే సీఎం చంద్రబాబు
x

ఈ రోజంతా ప్రకాశం జిల్లాలోనే సీఎం చంద్రబాబు

వివిధ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రత్యేకించి మహిళలతో సమావేశం కానున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలతో ఈ రోజు మొత్తం ప్రకాశం జిల్లాలోనే స్పెండ్‌ చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్‌ ఖరారైంది.

శనివారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలు దేరారు. మరి కొద్ది సేపట్లో హెలిక్యాప్టర్‌ ద్వారా నేరుగా మార్కాపురానికి చేరుకుంటారు. 10:45 గంటలకు మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద తుర్లపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఇక అక్కడ నుంచి తన కార్యక్రమాలలో బిజీ కానున్నారు. 10:45 నుంచి 10:55 గంటల మధ్య ప్రజా ప్రతినిధులు, ఇతర నేతల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరిస్తారు. పది నిముషాల సమయాన్ని దీని కోసం వెచ్చించనున్నారు.
అనంతరం 10:55 నుంచి 11:15 గంటల వరకు ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా ఆయన జిల్లా సమస్యల మీద చర్చించనున్నారు. వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. తర్వాత 12:20 గంటలకు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. తర్వాత రుణాల పంపినీ, పథకాల ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ప్రత్యేకించి మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు 2:30 గంటల వరకు మహిళలతో ముఖా ముఖి ఉంటుంది. తర్వాత 2:35 గంటల నుంచి 4:05 గంటల వరకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4:05 గంటల నుంచి 4:30 గంటల వరకు జిల్లా అధికారులతో మరో సారి సీఎం సమావేశం అవుతారు. ఆ తర్వాత హెలిక్యాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు.
Read More
Next Story