ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వండి
x

ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జరగనున్న పరిశ్రమాధిపతుల సమావేశం గురించి వివరించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్‌ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈనేపథ్యంలో పెట్టుబడుల సదస్సు ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకు సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు అంగీకరించారని, వారు త్వరలోనే తమ పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తారని సీఎం పలు మార్లు చెప్పారు. ఈ అంశాన్ని కూడా ఆమె వద్ద ప్రస్తావిస్తూ పరాశ్రామిక అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు.


ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. నిర్మలా సీతారామన్‌తో కు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేశారు.

పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. వెనుక బడిని ప్రాంతాల ఆర్థిక అభివృద్దికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ను కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని గురించి కేంద్రమంత్రికి సీఎం వివరించారు.

Read More
Next Story