కోడికత్తి మొదలు గులకరాయి వరకు.. అన్నీ డ్రామాలే, అన్నీ కుట్రలే!
x
అసెంబ్లీలో మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 

కోడికత్తి మొదలు గులకరాయి వరకు.. అన్నీ డ్రామాలే, అన్నీ కుట్రలే!

వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన, ఆయన పార్టీ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైఎస్ జగన్ రాజకీయాలను నేరమయం చేశాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాను పాటుపడుతుంటే సహకరించాల్సింది పోయి అన్నీ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిన్న జరిగిన స్వర్ణాంధ్రృ స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడిన తీరు ప్రతిపక్ష వైసీపీని ఇక ఉపేక్షించబోనన్న అర్థంలోనే ఉంది.
ఆయన ఏమన్నారంటే..
"YCP ఫేక్‌ ప్రచారాలను చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాలి. ఇక ఆ పార్టీ నాయకుడు గత 10 ఏళ్లలో చేసిన 10 సంఘటనలు చెబుతున్నా.. వినండి, అర్థం చేసుకోండి.. ఇవన్నీ వైసీపీ కుట్ర రాజకీయాలే, జగన్ క్రిమినల్ పాలిటిక్సే. వైసీపీ విష రాజకీయ పార్టీ.. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వివేకా హత్య కేసు, కోడి కత్తి డ్రామా, గులకరాయి దాడి, డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం, పింఛన్ల నిలిపివేతతో 15మంది వృద్ధుల మరణం, వాలంటీర్ల వ్యవహారం తదితర అంశాలను ప్రజలకు వివరించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలపై ధ్వజమెత్తారు. చేసిన తప్పును వేరే వాళ్లపై నెట్టడం జగన్ కి అలవాటు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అవసరమా.." అని ప్రశ్నించారు.
‘‘వైకుంఠపాళి ఆటలు మన రాష్ట్రానికి వద్దు. మనకు అభివృధ్ధి కావాలి.. పేదరికం పోవాలి. పేదవాళ్లకు సాయం చేసేందుకు మార్గదర్శులు ముందుకు రావాలి. పెద్దాపురం నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఎన్నికల ముందు పింఛన్లు పేరుతో ఎండల్లో తిప్పి వృద్ధుల మరణానికి కారణమయ్యారు. వాలంటీర్ల వ్యవస్థ లేకున్నా ఇంటింటికెళ్లి మరీ పింఛను ఇస్తున్నాం. మీ రాష్ట్రంలో భూతం ఉంది.. మళ్లీ రాదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. వదల బొమ్మాళీ అంటున్న వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రం బాగు కోసం కూడా పది తరాల ముందు ఆలోచించాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కలేదు.. అందుకే బయట విషం చిమ్ముతున్నారు. కారు కింద సొంత కార్యకర్త పడినా పట్టించుకోరు. నెల్లూరు వెళ్లి మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రచారం చేశారు. అమరావతి మునిగిపోయిందని వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తయారు చేస్తాం. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. వైసీపీ నేతలు మాత్రం పెట్టుబడిదారులను బెదిరిస్తారు. జగన్ హయాంలో నకిలీ వ్యక్తులకు దివ్యాంగుల పింఛన్లు ఇచ్చారు. పింఛన్లు అర్హులకే అందాలి.. అనర్హులకు కాదు. రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేలా విషప్రచారం చేస్తున్నారు. మనది విజన్‌ రాజకీయం.. వాళ్లది క్రిమినల్‌ రాజకీయం’’ అని చంద్రబాబు అన్నారు.
Read More
Next Story