ఐజిఎస్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
x

ఐజిఎస్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా ఐదు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. మరో 14 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.


అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయపాలెంలో ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా 220/440 కేవీ ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు.

తాడేపల్లిలోని 132 కేవీ విద్యుత్ కేంద్రాన్ని 220 కేవీగా అప్‌గ్రేడ్‌ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు.. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. మొత్తంగా అంతరాయం లేకుండా రాజధాని అమరావతికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే చంద్రబాబు జీఐఎస్​తో కలుపుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 సబ్​స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తంగా 14 సబ్​స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు సంబంధించి సీఎం భూమి పూజ చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ఏపీ ట్రాన్స్​కో నూతన సబ్​స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరోవైపు రూ.5407 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్​స్టేషన్లు, లైన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.

రాబోయే రోజుల్లో కరెంట్​ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్​ని తీర్చే దిశగా చర్యలు చేపట్టనున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా వృద్ధిని సాధించడంలో నాణ్యమైన నమ్మకమైన 24x7 గంటల కరెంట్ సరఫరాలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఏపీలో గణనీయంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Read More
Next Story