ఇంటికే పింఛన్ అందించిన సీఎం చంద్రబాబు..
x

ఇంటికే పింఛన్ అందించిన సీఎం చంద్రబాబు..

జూలై 1వ తేదీ ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ మొదలైపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు.. వీధుల వెంట తిరిగుతూ లబ్దిదారులకు పింఛన్ అందించారు.


జూలై 1వ తేదీ ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ మొదలైపోయింది. రూ.3వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడమే కాకుండా దానిని ఏప్రిల్ నెల నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్లే ఒకటోతేదీనే లబ్దిదారులకు రూ.7వేల రూపాయల పింఛన్ అందించింది ఆంధ్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క లబ్దిదారునికి పింఛన్‌ను ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల 18 వేల 496 మంది పించన్‌దారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వారందరికి వీలైనంత త్వరగా పింఛన్ అందించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సిబ్బంది.. లబ్దిదారులకు పింఛన్ అందించడంలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో పింఛన్ పంపిణీని స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు పర్యవేక్షించనున్నారు. ఎవరికైనా పింఛన్ అందని పక్షంలో వారు సదరు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని, వారికి వెంటనే పింఛన్ అందిలా చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే లబ్దిదారులకు పింఛన్ అందించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విచ్చేశారు.

ఇంటికెళ్లి పింఛన్ అందించిన సీఎం

తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం స్వయంగా తానే లబ్దిదారుని ఇంటికి వెళ్లి పింఛణ్అందిస్తున్నారు. మొత్తం 28 విభాగాల లబ్దిదారులకు కేటగిరీల వారీగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బానావత్ పాముల నాయక్‌కు వృద్ధాప్యయ పింఛణ్, అతని కుమార్తెకు వితంతు పింఛన్ అందించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే తమకు ఇల్లు కావాలని బానావత్ నాయక్.. సీఎంను కోరారు. వారి విన్నపం విన్న సీఎం తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. వారిని కలిసిన చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చి మమ అనిపించుకోలేదు. దాదాపు 15 నిమిషాల పాటు వారితో మాట్లాడారు. వారి సాదకబాదకాలను, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు తాము అహర్నిశలు శ్రమిస్తామని మరోసారి చెప్పారు సీఎం.

పింఛన్ పంపిణీలో పాల్గొన్న నారా లోకేష్

సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నారని, అంతా మంచే జరుగుతుందని నారా లోకేష్ ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకు వివరించుకోవచ్చని, టీడీపీ కూటమిలో ప్రజల్లో ఉండే నేతలే తప్ప ప్యాలెస్‌లలో ఉండే నేతలు లేరని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి నేతలు కూడా చొరవ చూపాలని, మా దగ్గరకు రాలేదుగా అనుకుని కూర్చుంటే కుదరదని వివరించారు. అంతేకాకుండా ‘‘ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం.. పింఛన్ పంపిణీలో చాలా గిమ్మిక్కులు చేసింది. తమ రాజకీయ లబ్ధి కోసం వృద్ధులను, దివ్యాంగులను అందరినీ ఇబ్బంది పెట్టింది. 33 మంది వృద్ధులను పొట్టనపెట్టుకుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోమని మేము ఎంత చెప్పినా కుదరదు అన్నారు. వాలంటీర్లతో ఇంటికి పింఛన్ పంపిణీ సాధ్యమన్నారు. అందుకే పట్టుదలతోనే ఈరోజున ఒకే రోజు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ చేసి చూపిస్తున్నాం’’ అని టీడీపీ చెప్పింది.

Read More
Next Story