
సింహాద్రి అప్పన్న దేవాలయం మూసివేత
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఆ ఆలయ కమిటి తెలిపింది.
చంద్రగ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాలు మూత వేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి దేవాలయాన్ని మూత వేస్తున్నట్లు ఇప్పటికే ఆ ఆలయ కమిటీ పెద్దలు ప్రకటించారు. తాజాగా ఏపీలో మరో ప్రముఖ దేవాలయం అయిన విశాఖపట్నం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆ ఆలయ అధికారులు వెల్లడించారు. అప్పన్న స్వామి దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఆ మేరకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వేండ్ర తినాథరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు భక్తుల స్వామి వారి దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు త్రినాథరావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రగ్రహణం అనంతరం తిరిగి సోమవారం అప్పన్నస్వామి దేవాలయం తెరవనున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి సర్వ దర్శనాలకు ఆలయ అధికారులు అనుమతులు ఇచ్చారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామి వారికి జరిగే వైదిక కార్యక్రమాల నేపథ్యంలో ఆదివారం, సోమవారం జరగాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని కూడా చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేస్తున్నట్లు ఆ ఆలయ కమిటీ ఇప్పటికే కటించింది. సోమవారం తెల్లవారు జామున భక్తులకు దుర్గమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
Next Story