తిరుపతిలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
x

తిరుపతిలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వెల్లడించారు.


తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వెల్లడించారు. 54 ఏళ్ల కిందట 1970 సంవత్సరంలో సిఐటియు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన రాజీలేని పోరాటాలు చేస్తోందని వివరించారు.

తిరుపతి నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పూర్వ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటయ్య పతాకావిష్కరణ చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగిస్తూ.. సిఐటియు దేశంలో, రాష్ట్రంలో అనేక పోరాటాలు చేపట్టిందని కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పెద్దపెద్ద త్యాగాలను చేసిందని గుర్తు చేశారు. జ్యోతి బసు, పుచ్చలపల్లి సుందరయ్య, బిటి రణధీవే, ఎంకే పాంధే లాంటి పోరాట యోధులు సిఐటియుకు నాయకత్వం వహించారని తెలిపారు.

తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఐటియు నిర్వహించిన పోరాటాలు అపూర్వమైనవని గుర్తు చేశారు. ఈ వరవడిని కొనసాగిస్తామని దేశంలోని మతోన్మాద శక్తులను ఎదుర్కొంటామని, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు, రైతాంగ చట్టాలకు బిజెపి ఎసరు పెట్టిందని... రాష్ట్రంలో బిజెపి లాంటి ప్రమాదకరమైన మతోన్మాద పార్టీకి వైసిపి, టిడిపి, జనసేన లాంటి పార్టీలు అండగా నిలబడటం తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. ప్రజల మధ్య ఐక్యత దేశ ప్రయోజనాలు కాపాడబడాలంటే బిజెపి లాంటి ప్రమాదకరమైన పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

జూన్ 4 తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని, కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, ఆర్ లక్ష్మి, టి సుబ్రమణ్యం, రామకృష్ణ, మాధవ్, వేణు, బాలాజీ, అక్బర్, తంజావూరు మురళి, ఆనంద్, అశోక్, ప్రసూన, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story