చింతూరు బస్సు ప్రమాదం..మృతుల వివరాలు
x

చింతూరు బస్సు ప్రమాదం..మృతుల వివరాలు

ఈ ప్రమాదంలో మరణించిన వారంతా చిత్తూరు జిల్లాకు చెందిన పర్యాటకులుగా పోలీసులు గుర్తించారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున టూరిస్టు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

అధికారులు, పోలీసులు మృతదేహాలను గుర్తించి, మరణించిన వారి వివరాలను ధృవీకరించారు.
మరణించిన వారి వివరాల జాబితా:
శ్రీ కళా సునందా
శివశంకర్ రెడ్డి
ఉమారెడ్డి
కృష్ణ కుమారి
రఘరా
మధు
పొంగుల ప్రసాద్ లు ఈ దుర్ఘటనలో మరణించినట్లు తెలిపారు. అయితే మరో ఇద్దరు, ముగ్గరు మృతదేహాలను ఇంకా పూర్తిగా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More
Next Story