
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఢిల్లీలో జరిగే సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం 10.15 గంటలకు విజయవాడ విమాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఆయన డిల్లీ చేరుకుంటారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్‌షోలు నిర్వహిస్తూ పారిశ్రామిక వేత్తలను ఇప్పటికే ఆహ్వానిస్తోంది.
ఈ క్రమంలో ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో సదస్సు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 04.45 గంటలకు ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తోనూ సీఎం భేటీ అవుతారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేస్తారు.
అక్టోబర్ 1న గజపతినగరంలో పేదల సేవలో కార్యక్రమం
అక్టోబర్ 1న విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 02.40 గంటలకు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు. సాయంత్రం అమరావతి చేరుకుంటారు.