చంద్రబాబు నోట జీసస్ మాట
x

చంద్రబాబు నోట జీసస్ మాట

విజయవాడ సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు


లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో సోమవారం జరిగిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గుంటూరులోని క్రిస్టియన్‌ భవనాన్ని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.

క్రిస్టియానిటీ ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక అన్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఏసుప్రభువు స్ఫూర్తితో విద్యాసంస్థలు ఏర్పాటు చేసి క్రిస్టియన్స్‌ మంచి చదువులు అందించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సేవలందించారని అన్నారు. పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను ప్రభువు చాటుకున్నారు. నమ్మినవారి కోసం బలిదానానికి కూడా వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భధ్రతతకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేను స్వయంగా వెళ్లి విచారణ చేశానన్నారు. ఎన్టీఆర్‌ కూడా గుంటూరు ఏసీ కాలేజీలోనే చదువుకున్నారని చెప్పారు. క్రిస్టియన్‌ మిషనరీస్‌ ప్రోపర్టీస్‌ డెవలెప్మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్‌ కట్‌ చేసి పాస్టర్లకు ముఖ్యమంత్రి తినిపించారు.
Read More
Next Story