హనీమూన్‌ వదలండి..మంత్రులకు చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌
x

హనీమూన్‌ వదలండి..మంత్రులకు చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది.


ఇక హనీమూన్‌ కాలం వదిలి.. పాలనలో దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులకు నవ్వుతూనే స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అజెండాలోని పలు అంశాలపై చర్చల అనంతరం రాజకీయ అంశాలపై ప్రస్తావనకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రులు, వారి పనితీరు గురించి చర్చించారు. అధికారంలోకి వచ్చి, మంత్రులుగా బాధ్యతలు తీసుకొని చాలా కాలమైందని, ఏడాదిగా సబ్జెక్టు నేర్చుకుంటూ మెరుగ్గానే పని చేశారని, ఇక హనీమూన్‌ కాలం వదిలి పాలనలో దూకుడు పెంచాలని మంత్రులకు సీఎం సూచించారు. మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు, కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం మంత్రులకు సూచించారు. వైసీపీ తప్పుడు వార్తల ప్రచారం చేస్తోందని, అలాంటి వైసీపీ వారి కుట్రల పట్ల జాగ్రత్తంగా ఉంటూ కౌంటర్లు ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతానికి మంత్రుల పనితీరు కాస్త మెరుగ్గానే ఉందని సీఎం మంత్రులకు సూచించారు. విమర్శలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని, తమ తప్పులు సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా కూటమిలోని జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వారి లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు, శాఖలపై మంత్రులు మంచి పట్టు సంపాదించుకోవాలని, ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలని సూచించారు. వచ్చే కేబినెట్‌ సమావేశంలో ప్రతి మంత్రి వారి వారి శాఖపై మాట్లాడిస్తానని, దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, మెరుగైన అంతర్జాతీయ సంబంధాలకు ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయనున్నాట్లు సూచించారు. సింగపూర్‌లో అమలు చేస్తోన్న విధానాల మీద ప్రత్యేక అధ్యాయనాలకు మంత్రులు సింగపూర్‌కు వెళ్లాలని, దశల వారీగా వెళ్లి అక్కడి విధానాలను స్డడీ చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.
Read More
Next Story