
చదరంగంలో చంద్రబాబు మనవడు ప్రపంచ రికార్డు
మా చాంపియన్‌కు శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు దేవాంశ్‌కు అభినందనలు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ కుమారుడు, సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు. చెస్‌లో వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్–175 పజిల్స్ సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వ్యూహాత్మకంగా ఆటతీరును ప్రదర్శించి 11 నిముషాల 59 సెకన్లలో పజిల్స్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించాడు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో చెస్‌కు సంబంధించి ఈ అవార్డును దేవాంశ్‌కు నిర్వాహకులు అందజేశారు. గతంలో కూడా దేవాంశ్ రెండు ప్రపంచ రికారుల్డను సాధించారు. కుమారుడు సాధించిన ఈ రికార్డు పట్ల తండ్రి నారా లోకేష్ స్పందించారు. దేవాంశ్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
పదేళ్ల వయసులోనే ఆలోచనలకు పదను పెడుతూ ఒత్తిడిలోను కూడా ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో చెస్ నేర్చుకున్నాడని, దేవాంశ్ పడిన కష్టాన్ని, గంటల తరబడి అతను చేసిన కఠోర శ్రమను ఓ తండ్రిగా దగ్గరుండి ప్రత్యకంగా చూశానని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పుడు దేవాంశ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నట్లు పేర్కొన్నారు. మనవడి దేవాంశ్ రికార్డు పట్ల సీఎం చంద్రబాబు స్పందించారు. 2025 వరల్డ్ రికార్డు అందుకున్నందుకు దేవాంశ్‌కు అభినందనలు తెలిపారు. నెలల తరబడి గురువుల డైరెక్షన్‌లో పట్టుదలగా ఎంతో కష్టపడి దేవాంశ్ ఈ ఘనత సాధించాడని, 175 పజిల్స్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా సాధించిన దేవాంశ్ సాధించిన రికార్డు పట్ల గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. మా చాంపియన్‌కు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
Congratulations to our Devaansh on receiving the World Book of Records Award 2025 at Westminster Hall, London. We are proud of his record-setting achievement as the Fastest Checkmate Solver at 175 puzzles after months of perseverance and the guidance of his mentors. Good going,… pic.twitter.com/baJfqnwuaS
— N Chandrababu Naidu (@ncbn) September 14, 2025