పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే, 12 నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ ప్రభుత్వం 7 నెలల కోసం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. అందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నాడు. చంద్రబాబుకు ధైర్యం లేదు. ఎందుకంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాలి. అలా చూపే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఎందుకంటే ఆ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు. అంటూ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పథకాలకు నిధులు కేటాయింపు ప్రస్తావిస్తే తాను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దాటవేస్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు. ఇన్ని రోజులు రాష్ట్రం ఏ దిశలో పయనిస్తోంది. రాష్ట్రం పూర్తిగా రివర్స్‌లో వెళ్తోంది. ప్రశ్నించే హక్కు లేదు. ఎక్కడికక్కడ అణిచివేత. ఇది చాలా బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
భయపెడుతున్న పాలన
రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నాడు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబుకు ఒక మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఉంటుంది. అది ఒక వంచన, దగా, మోసం. ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు. తాను ఎంచుకున్న టార్గెట్‌ను రీచ్ కావాలంటే టార్గెట్ చేసిన వ్యక్తిపై విమర్శలు చేసి అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత అనుకూల ఛానళ్లలో చర్చలు. వాటిలో నిశిత విమర్శలు. అంతా చేసి, చివరకు ఏమి ముగింపు ఇస్తారంటే.. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు.
దారుణాలకు మా ప్రభుత్వం కారణమట..
రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. అరాచకం ఉంది. దానికి కారణం మా ప్రభుత్వం అని నిందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయని ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు ఏమని ప్రచారం చేశారు? రాష్ట్ర అప్పు రూ. 14 లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేశారు. మరోవైపు.. లెక్కకు మించి హామీలు.. సూపర్ సిక్స్ అంటూ హామీలు. ఎన్నికల తరవాత హామీల అమలు చేయాల్సి రావడంతో చంద్రబాబు మరో మోడరన్ ఆపరేటింగ్‌కు దిగాడు. రాష్ట్ర అప్పు రూ. 14 లక్షల కోట్లు లేకున్నా.. అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రూ.10 లక్షల కోట్లు అప్పు అన్నారు. దాన్నే గవర్నర్‌గారి ప్రసంగంలో చెప్పించారు. పచ్చి అబద్దాలు చెబుతున్న చంద్రబాబు గవర్నర్ ప్రసంగంలో కూడా అవే చెప్పించాడు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఆ పని చేయడం లేదు.
ప్రభుత్వ అప్పు ఎంత..
ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ. 5,18,708 కోట్లు. బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2,71,798 కోట్లు. అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,18,051 కోట్లు. ఇంకా గవర్నమెంట్ గ్యారెంటీల అప్పులు పరిశీలిస్తే.. చంద్రబాబు దిగే నాటికి రూ. 50 వేల కోట్లు. అవి మా ప్రభుత్వం దిగి పోయే నాటికి రూ.1,06,000 కోట్లు మాత్రమే.
స్టేట్ లయబిలిటీ అప్పులన్నీ కలిపితే...
బాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.1,53,347 కోట్లు కాగా, ఆయన దిగిపోయే నాటికి అవి రూ.4,08,710 కోట్లకు చేరాయి. ఇది 21.63 శాతం పెరుగుదల. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ,7,48,000 కోట్లు అప్పు ఉంది. ఇది 12.90 శాతం మాత్రమే పెరుగుదల. ఆయన హయాంలో అప్పులు ఎక్కువయ్యాయా? లేక మా హయాంలోనా? దీన్ని అందరూ గుర్తించాలి.
కేంద్ర ఆర్థిక సర్వేలో..
కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గింది. అప్పుడు అవసరమైన అప్పు చేసుకోవడానికి వెసులు బాటు కల్పించినా, ప్రభుత్వం శక్తికి మించి అప్పు చేయలేదు. 2019లో మేము అధికారం చేపట్టేనాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అదే విషయాన్ని ఆనాడు ఎల్లో మీడియా (ఈనాడు) కూడా రాసింది. అయినా మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రకటించాము. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. కానీ.. ఇలా చంద్రబాబు మాదిరిగా 7 నెలల కోసం ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు వెళ్లలేదు. చంద్రబాబు విడుదల చేస్తోంది ‘వైట్ పేపర్లు కాదు. తప్పుడు పేపర్లు’ మాపై నిందలు మోపడం, విమర్శించడం కోసం అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ.. నేను వినుకొండ వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ ఘటనపై రెండుసార్లు సమీక్ష, డీజీపీని హుటాహుటిన మదనపల్లెకు హెలికాప్టర్‌లో పంపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నిందలు మోపుతూ నానా హంగామా చేశారు. దానిపై ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించారు. ఆర్డీఓ ఆఫీస్‌లో ఒకవేళ డాక్యుమెంటు కాలిపోతే, అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటాయి. చివరకు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేయడం కోసం నిందలు. విమర్శలు మొదలు పెట్టారు. ఆయన 7సార్లు ఎమ్మెల్యే. ఆయన కొడుకు మూడుసార్లు ఎంపీ. అలాంటి వారిపై దాడి. ఆస్తుల విధ్వంసం. మళ్లీ వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణం.
మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన చంద్రబాబు.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే చివరకు ఆమె బాడీ ఇంకా దొరక్కపోయినా, ప్రభుత్వం స్పందించలేదు. కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీ బదిలీ. ఒక అనుమానితుడి లాకప్ డెత్.
మహిళలకు రక్షణ లేదు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారం. మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు. దిశ యాప్. మహిళలకు ఒక వరంలా ఉండేది. ఆపదలో ఉన్న మహిళలు యాప్‌ను వినియోగించినా, ఫోన్‌ను 5సార్లు ఊపినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే వారు. ఇప్పుడు అవేవీ పని చేయడం లేదు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి.
పల్నాడు జిల్లాలో దారుణం
సీనియర్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసు పెట్టారు. ఎస్పీని మార్చారు. తమకు అనుకూలంగా ఉండే బిందుమాధవ్‌ను తెచ్చుకుంటే, ఆయన ఇష్టానుసారం వ్యవహరించాడు. దీంతో ఎన్నికల సంఘమే స్పందించి, ఆయనను బదిలీ చేసింది. శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన వెంటనే వినుకొండలో రషీద్ హత్య జరిగింది.
లోకేష్ రెడ్ బుక్
సీఎం కొడుకు, మంత్రి అయిన నారా లోకేష్ ఏకంగా ఇలా రెడ్‌బుక్ ప్రదర్శిస్తూ.. బెదిరింపులు. రాష్ట్రమంతా హోర్డింగ్‌లు, ఎంత దారుణం. అలా ఏం సందేశం ఇవ్వదల్చారు? అంటూ జగన్ ప్రశ్నించారు.
అరాచకాలు..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్ పాలన. రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రావొద్దు. హామీలు అమలు చేయకపోయినా, చంద్రబాబును ప్రశ్నించకూడదు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతీ దీవెన, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ ఒక్కటీ ఇంతవరకు ఇవ్వలేదు.
పోలవరం ప్రాజెక్ట్
పోలవరం ప్రాజెక్టు సరిగా పూర్తికాకపోవడానికి సీఎం చంద్రబాబునాయుడే కారణం, స్పిల్వే వర్క్ పూర్తి చేయనందునే ప్రాజెక్టు నిర్మాణాలు కొట్టుకుపోయాయి. రామోజీరావు వియ్యంకుడు, యనమల రామక్రిష్ణుడు బందువులకు సబ్ కాంట్రాక్ట్ లు ఇవ్వడం ద్వారా దోపిడీ చేశారు. అసలు కేంద్రం కట్టించే ప్రాజెక్టు పనులు నేను చేస్తానని తీసుకొని దారుణమైన నిర్ణయాలతో ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేశారు.