చంద్రబాబు ఆకాంక్ష ఆశ్చర్యాన్ని కలిగించింది
x

చంద్రబాబు ఆకాంక్ష ఆశ్చర్యాన్ని కలిగించింది

పదేళ్ల తమ ప్రస్థానంలో సీఎం చంద్రబాబు వద్ద ఎప్పుడూ సినిమాల గురించిన ప్రస్తావన రాలేదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


హరిహర వీరమల్లు సినిమా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు, ఆకాంక్షించిన విధానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఘన విజయాన్ని సాధించాలని సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సీఎం చంద్రబాబు గారితో నేను గత పదేళ్లల్లో పలుమార్లు సమావేశం అయ్యాయం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష–ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్‌ కల్యాణ్‌.. చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Read More
Next Story