జగన్ బాటలో చంద్రబాబు.. భవనేశ్వరితో కలిసి విదేశాలకు
x

జగన్ బాటలో చంద్రబాబు.. భవనేశ్వరితో కలిసి విదేశాలకు

జగన్ యూరప్‌కు వెళ్లిన కొద్ది రోజులకే చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఒక్కసారిగా ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. లోకేష్, బ్రాహ్మణి కూడా అమెరికాలో ఉన్నారు. ఎందుకు..


ఎన్నికల హడావుడితో ఆంధ్రలో రాజకీయ హీట్ పెరిగిపోయింది. ప్రతి పార్టీ నేత కూడా ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి రోజుకు రెండుమూడు నియోజకవర్గాల్లో తిరుగుతూ సభలు నిర్వహించారు. ఎట్టకేలకు మే 13న పోలింగ్ ముగియండంతో ఇప్పుడు వారంతా రిలాక్స్ మోడ్‌లోకి అడుగు పెట్టారు. ఎవరికి తోచినట్లు వాళ్లు తమ రిలాక్స్ మోడ్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రలో పోలింగ్ ముగిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ విదేశాల పర్యటనలకు బయలదేరారు. ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు.

శనివారం అర్దరాత్రి ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరారు. ఈ రోజు ఉదయం ఆయన అమెరికాకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే అసలు చంద్రబాబు ఇంత సడెన్‌గా ఎందుకు అమెరికాకు వెళ్లారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేవలం ఎంజాయ్ చేయడానికా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే చాలా వరకు వైద్య పరీక్షల కోసమే చంద్రబాబు.. అమెరికా పర్యటనకు వెళ్లారని, అందుకనే దానిని బహిర్గతం చేయకుండా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

ఇదే తొలిసారి కాదు

చంద్రబాబు నాయుడు.. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు ఆయన వైద్యపరీక్షల నిమిత్తం అగ్రరాజ్య పర్యటన చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా వైద్య పరీక్షలకు వెళ్లినట్లు పార్టీ వర్గాలు కొన్ని చెబుతున్నాయి. పరీక్షలు పూర్తయిన ఐదారురోజుల తర్వాత ఆయన తిరిగా రాష్ట్రానికి చేరుకుంటారని తెలిపాయి. ఇదే విధంగా నారాలోకేష్, నారా బ్రాహ్మణి కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు.

Read More
Next Story