చంద్రబాబు ’తిరుగులేని సహజ శక్తి‘
x

చంద్రబాబు ’తిరుగులేని సహజ శక్తి‘

చంద్రబాబు పాలసీలు 'అడుగడుగునా అవకాశాలు' కల్పిస్తున్నాయని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు తీసుకొస్తున్న పెట్టుబడి స్నేహపూర్వక విధానాలు,చంద్రబాబు అవిశ్రాంత కృషికి అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో చంద్రబాబు ప్రకటించిన ఎస్క్రో విధానాన్ని 'తిరుగులేని శక్తి'గా అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా పెట్టుబడిదారులకు నేరుగా రాయితీలు చెల్లించేందుకు ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం ఆయన దార్శనికతకు నిదర్శనమని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్‌లో కొనియాడారు.

సీఐఐ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు, భూ కేటాయింపులు, త్వరిత అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఒప్పందాలు (MoU) చేసిన వెంటనే ఎస్క్రో ఖాతా ఏర్పాటు అవుతుంది. బ్యాంకు ద్వారా రియల్‌టైమ్‌లో నిధులు విడుదల చేస్తాము. అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేదు. అవసరమైతే దానికి హామీ (sovereign guarantee) కూడా ఇస్తాము అని ఆయన ప్రకటించారు. గత 18 నెలల్లోనే 20 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామని, రాబోయే మూడేళ్లలో 500 బిలియన్ డాలర్లు, 10 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ పెట్టుబడులతో 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, విశాఖను ఐటీ, డేటా సెంటర్లు, డ్రోన్ టాక్సీలకు హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలు వ్యాపారవేత్తల మనసులను కదలించాయి.

ఆనంద్ మహీంద్రా తన ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో చంద్రబాబు ప్రసంగాన్ని పంచుకుని, “ఈ మనిషి తిరుగులేని సహజ శక్తి. డెకేడ్లుగా అభివృద్ధి కోసం విధానాల్లో మార్పులు తెస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబు విధానాలను మహీంద్రా కొనియాడారు. “ఈ మనిషి తిరుగులేని సహజ శక్తి” అని చంద్రబాబును అభివర్ణిస్తూ, ఆయన దార్శనికతకు, ఆవిష్కరణాత్మక విధానాలకు మెచ్చుకున్నారు. ఈ విధానంతో అధికారుల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని, భూమి కేటాయింపులు, త్వరిత అనుమతులు ఇచ్చి పారిశ్రామికులకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ పోస్టు పెట్టుబడిదారులలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆనంద్ మహీంద్రా పోస్టుకు స్పందించిన చంద్రబాబు, “మీ ప్రశంసకు ధన్యవాదాలు. భారతదేశం మార్పుకు సిద్ధమవుతోంది. మా విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. త్వరలో మీకు ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మీయంగా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాను” అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మహీంద్రా గ్రూపుతో గత దశాబ్దాలుగా ఉన్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణకు కొత్త ఊపిరి పోస్తోంది.

Read More
Next Story