చంద్రబాబు కళ్లు తెరవాలి..రైతులను ఆదుకోవాలి
x

చంద్రబాబు కళ్లు తెరవాలి..రైతులను ఆదుకోవాలి

గుంటూరు మిర్చి యార్డుకు జగన్‌ వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. సీఎం..సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మోత మోగించారు.


రైతులను ఆదుకోవడంలోను, వారికి భరోసా కల్పించడంలోను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని, ఇప్పటికైనా కళ్లు తెచిరి రైతులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకెళ్లారు. అక్కడ రైతులను కలిశారు. వారితో ముఖా ముఖి నిర్వహించిన అనంతరం జగన్‌ మాట్లాడారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం సీఎం చంద్రబాబు గట్టిగా నిలబడక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి ప్రభుత్వాన్ని జగన్‌ హెచ్చరించారు.

ఈ సందర్భంగా పోలీసు భద్రత గురించి జగన్‌ ప్రస్తావించారు. రైతులతో మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే కనీస భద్రత కల్పించలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి.. ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు మీకు పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటూ సీఎం చంద్రబాబు మీద ధ్వజమెత్తారు.
సచివాలయానికి గుంటూరు మిచ్చి యార్డు ఎంత దూరమని ప్రశ్నించారు. కూతవేటు దూరంలో ఉన్న దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడుతున్న కష్టాలు చంద్రబాబుకు అర్థం కాడం లేదా అంటూ దూయ్యబట్టారు. రైతులు కష్టాలు కనిపించినా కళ్లు మూసుకొని పాలన సాగిస్తున్నారా అని మండిపడ్డారు. తాము పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. ఒక వైపు తెగుళ్ల వల్ల, మరో వైపు ధరలు లేక పోవడంతో రైతులు అల్లాడి పోతున్నారని అన్నారు. తమ హయాంలో క్వింటా మిర్చి ధర రూ. 21వేలు వరకు ఉంటే కూటమి హయాంలో రూ. 11వేలు కూడా లేదన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులు రూ. 2లక్షలకుపైగా అవుతోంది. రేటు ఉండటం లేదు. పంట తగ్గింది. ఉన్న పంటను అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయిందన్నారు. ఒక పక్క గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతుంటే.. మరో పక్క రైతులను దాళారులకు అమ్మేస్తున్నారని సీఎం చంద్రబాబు మీద ధ్వజమెత్తారు.
రైతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ హయాంలో తెచ్చిన సంస్కరణలను సీఎం చంద్రబాబు నీరుగార్చారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు మేలు జరిగేది. కానీ వాటిని నీరుగార్చు. ధాన్యం కొనుగోలుకు రూ. 65 కోట్లతో మేలు జరిగే విధంగా నాడు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఆర్‌బీకేలు, వాటికి ఇంటిగ్రేటెడ్‌ అయిన ల్యాబ్‌లు నిర్వీర్యం అయ్యాయి. ఎరువు, విత్తనాలు సరఫరా లేకుండా పోయింది. ఎరువులు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కోవాలి. సీఎం చంద్రబాబు కళ్లు తెరవాలి. పెట్టుబడి సాయం కింద రైతులను ఆదుకోవాలి. సున్నా వడ్డీని కల్పించాలి. సీఎం చంద్రబాబు రైతుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైతుల తరఫున పోరాటాలు సాగిస్తామని జగన్‌ చెప్పారు.
గుంటూరు మిర్చి యార్డుకు జగన్‌ వచ్చిన సందర్భంగా ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఎం..సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. దీంతో జగన్‌ స్వరం పెంచి పెద్దగా అరచి మాట్లాడాల్సి వచ్చింది. దీంతో జగన్‌ గొంతు కాస్త బొంగుర పోయింది. మధ్య మధ్యలో ఆయన దగ్గుతూ.. సవరించుకుంటూ బొంగుర పోయిన గొంతుతోనే తన మీడియా ప్రసంగాన్ని కొనసాగించారు.
Read More
Next Story