మోదీ టూర్‌ .. ఏర్పాట్లపై చంద్రబాబు రివ్యూ
x

మోదీ టూర్‌ .. ఏర్పాట్లపై చంద్రబాబు రివ్యూ

మన అమరావతి - మన రాజధాని అనేది అందరి నినాదం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించి పనులు జరుగుతున్న తీరును చంద్రబాబు ఆరా తీశారు. ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైన పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రధాన వేది ఏర్పాటుతో పాటు వాహనాల పార్కింగ్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభకు తరలి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటుగా వేసవిని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ, తాగు నీరు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి 5లక్షల మంది ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. వీరికి తగిన ఏర్పాట్లు చేయాలి. విద్యార్థుల కూడా వచ్చే అవకాశం ఉంది. వీరు కూర్చోవడానికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులు, మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఆమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు మే2న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి రానున్నారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని ఆహ్వానించారు. భారీగా సభను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లకు ఉపక్రమించింది. దీని కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. లక్ష కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులను మోదీతో శంకుస్థాపనలు చేయించే విధంగా ప్రత్యేక పైలాన్‌ను కూడా రూపొందిస్తున్నారు. దీనిని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. మన అమరాతిమన రాజధాని అనేది ప్రతి ఒక్కరి నినాదం కాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులను గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు. అందరూ కలిసి మోదీ పర్యటనను సక్సెస్‌ చేసే విధంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.
Read More
Next Story