
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్షించనున్న చంద్రబాబు
తెలంగాణా తెలుగుదేశం నేతలతో సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు , జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు అలర్ఠ్ అయ్యారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ కూడా రావడంతో ఆ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు సాయంత్రం తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానం, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాలపై టీడీపీ తెలంగాణ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జూబ్లీహిల్స్ స్థానంలో తెలుగుదేసానికి బలం వుండటం , అక్కడి నుంచి గతంలో మాగంటి గోపీనాధ్ తెలుగుదేశం తరుపున గెలిచి వుండటంతో ఆ సీటుపై తెలుగుదేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. టీడీపీ నుంచీ అభ్యర్ధిని నిలబెడతారన్న వార్తలు వినిపించాయి. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లోకేష్ తో సమావేశం అయ్యారని టీడీపీ మద్దతు కోరారన్న వార్తలు వచ్చాయి.ఏపీలో టీడీపీ కూటమిలో వున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబుతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే కూటమి అభ్యర్ధి విజయానికి సహకరించాలని చంద్రబాబు సూచించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె పర్యటనలో వున్నారు. తమ్ముడు నారా రామూర్తి నాయుడు మరణించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నారావారిపల్లెలో సంవత్సరీకం, స్మృతి వనం ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నారావారిపల్లె సమీపంలోని రంగపేట హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి నారావారిపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. నారా రామూర్తినాయుడు సంవత్సరీకం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.అక్కడి నుంచి తిరిగి రాగానే సాయంత్రం 7 గంటలకు ఉండవల్లి నివాసంలో తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం అవుతారు.
Next Story