అమరావతిలో సీఆర్‌డిఏ బిల్డింగ్‌ను ప్రారంభించిన చంద్రబాబు
x

అమరావతిలో సీఆర్‌డిఏ బిల్డింగ్‌ను ప్రారంభించిన చంద్రబాబు

రాజధాని నిర్మాణానికి సహకరించారని రాజధాని రైతుల గురించి సీఎం చంద్రబాబు వెల్లడించారు.


అమరావతిలో నిర్మించిన మున్సిపల్‌ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని సీఎం చంద్రబాబు సీఆర్‌డిఏ భవనాన్ని సోమవారం ఉదయం 9.54 గంటలకు భవనాన్ని ప్రారంభించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య సీఆర్‌డిఏ భవనాన్ని ఓపెనింగ్‌ చేశారు. ప్రారంభం సందర్భంగా పండితులు సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రాజధాని పనులు రీ–స్టార్ట్‌ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇదే. భవనాన్ని ప్రారంభించిన అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు. ఎ+7 భవనంతో పాటు మరో నాలుగు పీఈబీ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్‌ తో పాటు మున్సిపల్‌ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేపట్టారు. భవనం ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులతో మాట్లాడారు. రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Read More
Next Story