చంద్రబాబుతో పవన్ భేటీ.. అందుకేనా..?
x

చంద్రబాబుతో పవన్ భేటీ.. అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నెవ్వర్ బిఫోర్ విజయం సాధించింది. 165 స్థానాల్లో గెలిచింది. సీఎం జగన్.. సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నెవ్వర్ బిఫోర్ విజయం సాధించింది. 165 స్థానాల్లో గెలిచింది. సీఎం జగన్.. సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు. త్వరలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి ఆల్‌ ది బెస్ట్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. జనసేన కార్యాలయానికి విచ్చేసిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. శాలువా కప్ప సత్కరించారు.

తనయుడిని పరిచయం చేసిన పవన్

ఈ సందర్బంగానే తన కుమారుడు అకీరా నందన్‌ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. ఈ సందర్బంగానే అకీరా.. చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నాడు. అంతకుముందే పవన్ భార్య అన్నా లెజ్నెవా.. పవన్ కల్యాణ్‌కు వీరతిలకం దిద్ది హారతి పట్టి మంగళగిరి పంపారు.

దాని గురించే భేటీ

గెలిచిన అనంతరం పవన్ కల్యాన్, చంద్రబాబు భేటీ కావడంతో అసలు దేనికి ఈ భేటీ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథయంలోనే ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టాల్సిన కార్యాలపై వారు చర్చించుకున్నారని సమాచారం. దాంతో పాటుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నట్లు తెలుస్తోంది.

అసలు చర్చ దాని గురించా..

కానీ మరోవైపు మాత్రం వీరిద్దరి భేటీ వెనక అసలు కారణం వేరే ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో పవన్ ఇవ్వాల్సిన పోస్ట్‌పై వారు చర్చించుకుంటున్నట్లు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవిని బాబు ఆఫర్ చేస్తున్నారని, కానీ పవన్ మాత్రం డిప్యూటీ సీఎం లేదా హోం అడుగున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అతి త్వరలో ఇరు పార్టీల నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Read More
Next Story