చంద్రబాబు, జగన్‌ నోట..జైహింద్‌ మాట
x

చంద్రబాబు, జగన్‌ నోట..జైహింద్‌ మాట

ఆపరేషన్‌ సింధూర్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు స్పందించారు.


భారత దేశం తనను తాను రక్షించుకుంటుదని సైన్యం నిరూపించిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు భారత దేశ సైనిక దళాలను ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత దేశం సైనిక దళాలలకు నేను గర్వంగా సెల్యూట్‌ చేస్తున్నాను. భారత దేశ సైనిక దళాల అసమాన ధైర్యం, కచ్చితత్వం, ఉక్కు సంకల్పంతో భారత దేశం తనను తాను రక్షించుకుంటుందని మరో సారి భారత సైనిక దళాలు నిరూపించాయని సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఈ రోజు గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచం భారత దేశ బలం, దృఢ సంకల్పాన్ని చూసింది. భారత దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. భారత దేశ సైనిక దళాలకు మద్దతు ఇస్తుంది. అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అంతకుముందు పహల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఉగ్ర స్థావరాలపై భారతదేశం మెరుపు దాడులు చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు స్పందించారు. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా భారతదేశం సైనిక బలగాలు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపైన దాడులు చేపట్టి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్‌ సింధూర్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జైహింద్‌ అంటూ ఎక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇండియన్‌ ఆర్మీ, పహల్గాం టెర్రరిస్ట్‌ అటాక్, ఎయిర్‌ స్ట్రైక్, ఆపరేషన్‌ సింధూర్‌లకు ట్యాగ్‌ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆపరేషన్‌ సింధూర్‌పై స్పందించారు. భారత సైనిక బలగాలు పాకిస్తాన్‌ ఉగ్ర స్థావరాలపై చేపట్టిన దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.
పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సింధూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సయమంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం.. జైహింద్‌ అంటూ పోస్టు పెట్టారు.
Read More
Next Story