50 రోజుల్లోనే విఫలమైందీ ప్రభుత్వం.. జగన్
x

50 రోజుల్లోనే విఫలమైందీ ప్రభుత్వం.. జగన్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జగన్.. ప్రభుత్వమే టార్గెట్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జగన్.. ప్రభుత్వమే టార్గెట్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని, ప్రజలకు భయబ్రాంతుల్లో బతకాల్సి వస్తుందని మండిపడ్డారు జగన్. రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోందని, ప్రజలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకార రాజకీయాలు చేస్తూ వైసీపీ కార్యకర్తలే టార్గెట్ దాడులు చేయిస్తున్నారని కూడా మండిపడ్డారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

50 రోజుల్లో విఫలం

అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే అన్ని విధాలా విఫలమైందన్నారు జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కనుమరుగైందని, రాక్షస పాలన మొదలైందని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతలా భయపడుతుందంటే ఆఖరికి ఈ ఏడాది 12 నెలలకు బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక పోతోంది. ఒక రాష్ట్రం ఏడాదిలో 7 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైనే నడుసతుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. మన దేశ చరిత్రలో ఇలా జరిగిన దాఖలాలు లేవు’’ అని పేర్కొన్నారు.

హామీలకు గతిలేదు

‘‘ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించి ప్రజలను మభ్యపెడుతూ, మోసం చేసేలా వెల్లడించిన హామీలను కూడా నెరవేర్చే స్థితిలో ఏ ప్రభుత్వం లేదు. ఈ విషయం మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పౌరుడికి ఇది అర్థమవుతోంది. అందుకే బడ్జెట్‌ను కూడా పూర్తిగా ప్రవేశపెట్టలేకున్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే ఇచ్చిన హామీలను అమలు చేయలేమన్న గుట్టు రట్టవుతుందని బాబు బెంబేలెత్తుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలకు ఏక్కడ ప్రశ్నిస్తారో అని భయం’’ అని రాసుకొచ్చారు.

అందుకే అరాచకపాలన

‘‘ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం, ప్రజలకు భయబ్రాంతులకు గురిచేసేలా పరిస్థితులు ఏర్పరచడం చేస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడే హామీల గురించి ఎవరూ ప్రశ్నించే సాహసం చేయరని వారు భావిస్తోంది. కానీ ప్రజల తరుపున వైసీపీ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ప్రజల సమస్యలను పతాక స్థాయికి తీసుకెళ్లైనా పరిష్కారమయ్యేలా చూస్తాం’’ అని రాసుకొచ్చారు.

ప్రతిపక్షంగా గుర్తించాలి

‘‘ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. అవి ఒకటి అధికార పక్షం.. రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఇక్కడ ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా, ఆపార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారని కూటమి ప్రభుత్వం భయపడుతోంది. ప్రతిపక్ష నేతను గుర్తిస్తే అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించడానికి హక్కు మాదిరిగా అతడికి మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రజల సమ్యలపై విపక్ష నేత చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని ఎండగడతారు. అప్పుడు వారి నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోతుందన్న భయంతోనే ప్రతిపక్షమనేది లేకుండా, ప్రతిపక్ష నేతను గుర్తించడం లేదు’’ అని అన్నారు జగన్.

పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది

‘‘50 రోజుల్లోనే చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారు. శిశుపాలుడి పాపాల తరహాలోనే చంద్రబాబు పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉంది. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయులు అందరిమీ ఢిల్లీకి వెళ్తున్నాం. ఆంధ్రలో జరుగుతున్న అరాచకపాలన, హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని ఈ నెల 24న ఫొటో గ్యాలరీ, ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని కోరబోతున్నాం. మాతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆయన రాసుకొచ్చారు.

Read More
Next Story