చంద్రబాబు ఒక క్రిమినల్..కేవీరావు ఒక బ్రోకర్
కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అందరినీ క్రిమినల్ అని అంటారని, కానీ చంద్రబాబే ఒక క్రిమినల్.. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడమేంటి? కేవీరావు, చంద్రబాబులపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనపైన విరుచుకు పడ్డారు. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేవీరావుకు ఒక వేళ అన్యాయం జరిగి ఉంటే నాడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చని అన్నారు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపట్టాడని ప్రచారం చేస్తున్నారు.. కేవీరావుకు ఫోన్ చేసినట్లు.. బెదిరించినట్లు ఆధారాలున్నాయా? అని నిలదీశారు. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు ఆడుతున్న దొంగ నాటకాలని ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టును ఏడీడీ నిధులతో ఏర్పాటు చేశారని, ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు. కాకినాడ పోర్టును మలేషియా ప్రధాని మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారని, ఆ ముసుగులో కేవీరావుకు కాకినాడ పోర్టును కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. కేవీరావును దొడ్డిదారిలో సీఎండీ స్థానంలో చంద్రబాబు కూర్చోబెట్టారని మండిపడ్డారు.