కర్నూలుకు రండి..మోదీకి చంద్రబాబు ఆహ్వానం
x

కర్నూలుకు రండి..మోదీకి చంద్రబాబు ఆహ్వానం

ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.


అక్టోబరు 16న కర్నూలులో నిర్వహిస్తున్న సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దీంతో పాటుగా విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు కూడా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సోమవారం ఉదయం అమరావతిలో ఆధునిక హంగులతో నిర్మించిన తొలి పరిపాలనా భవనం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేషతో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిముషాల పాటు జరిగిన వారి భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజలకు ఉపయోకరమైన రీతిలో జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే రేపు మంగళవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ కూటమి ప్రభుత్వం గూగుల్‌ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌ పాల్గొననున్నారు. విశాఖలో నెలకొల్పే గూగుల్‌ ఏఐ హబ్‌తో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్‌ రాకతో విశాఖ నగరం ఏఐ సిటీగా అవతరించనుందని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. విశాఖకు గూగుల్‌ రాక వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 1.88లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరో వైపు ప్రధాని మోదీ భేటీలో చర్చించిన అంశాలను సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ మేరకు ఆయన సోమవారం మోదీ భేటీ అనంతరం ట్వీట్‌ చేశారు.

Read More
Next Story