పంచాంగ శ్రవణం నిర్వహించిన బాబు.. రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లంటే
x

పంచాంగ శ్రవణం నిర్వహించిన బాబు.. రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లంటే

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు.. ఉగాది పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు.



ఉగాది పండగను పురస్కరించుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అనంతరం పంచాంగ శ్రవణం కూడా నిర్వహించారు. ఇందులో రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ ఏడాది చంద్రబాబుకు ఎలా గడవనుంది అన్న విషయాలను కూడా పంచాంగ శ్రవణం చేసిన బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ వెల్లడించారు. ఇంకా మరెన్నో విషయాలను ఆయన పంచాంగ శ్రవణంలో తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును కూడా అంచనా వేశారు.


పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే!


‘‘అద్వితీయమైన అభివృద్ధి పథంలో టీడీపీ పయనిస్తుంది. కర్కాటక రాశి కలిగి ఉన్న చంద్రబాబు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత అధికమవుతుంది. జాతకం పరంగా చూసుకుంటే ప్రజల సొంతింటికలను నెరవేర్చే సత్తా చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుంది’’అని చెప్పారు మాచిరాజు వేణుగోపాల్.


బాబుకు అధికార యోగం


‘‘చంద్రబాబుకు ఈ ఏడాది అద్వితీయంగా ఉంది. ఆయనకు అధికార యోగం ఉంది. త్రిమూర్తుల కలయికతో ఆంధ్రప్రదేశ్‌కు శుభం జరుగుతుంది. బ్రహ్మ-మోడీ, విష్ణువు-పవన్, ఈశ్వరుడు-చంద్రబాబు. చంద్రబాబు.. అమరావతి నిర్మాణాన్ని చేపడతారు. టీడీపీది వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు తలపెట్టిన కార్యాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనలో అడ్డంకులు వచ్చిన వారు తమ లక్ష్యాన్ని సాధించి తీరతారు’’అని వెల్లడించారాయన.



Read More
Next Story