చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేటు మనిషే
x

చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేటు మనిషే

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబుకు బొత్స సూచించారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రైవేటు మనిషే అంటూ వైసీపీ సీనియర్‌ నాయకుడు, మండలిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైన, కూటమి ప్రభుత్వ పాలనపైన ఆయన విమర్శలు గుప్పించారు. దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన మెడికల్‌ సీట్లను వద్దని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమని ఫైర్‌ అయ్యారు. కట్టిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు ఇవ్వడం, కష్టపడి తీసుకొచ్చిన మెడికల్‌ సీట్లను వద్దని తరస్కరించిన ప్రభుత్వం బహుశా ఇదే అని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదల కోసం నాటి సీఎం వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

కూటమి పాలనలో ఏపీలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడు కూడా యూరియా సమస్య రాలేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని విమర్శించారు. యూరియా కోసం రైతులు లైన్‌లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతూ కూటమి మంత్రులు వ్యంగంగా రైతులు గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులను బెదిరించడం ఏంటని, టీడీపీ బెదిరింపులకు వైసీపీ భయపడదన్నారు.
Read More
Next Story