విద్యాకానుకపై బాబు ఫోకస్.. సరైన చర్యలు తీసుకోవాలంటూ..
x

విద్యాకానుకపై బాబు ఫోకస్.. సరైన చర్యలు తీసుకోవాలంటూ..

జగనన్న విద్యాకానుకను యథాతథంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఖజానాను ఎట్టిపరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందంటే పాత ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకవేళ పాత పథకాల్లో పంపిణీ చేస్తున్న వస్తువులపై ఎక్కడైనా పాత సీఎం పేరు లేదా ఫొటో ఉంటే వెంటనే వాటి పంపిణీ నిలిపేసీ.. వాటి స్థానంలో కొత్త సీఎం పేరు లేదా ఫొటోతో కొత్త వస్తువులను సిద్ధం చేసి సరఫరా చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించడం, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం మన రాష్ట్రంలో పరిపాటిగా మారింది. ఏదో గతంలో ఒకరో ఇద్దరో ఇలా చేయకపోయినా చాలా వరకు ముఖ్యమంత్రులు ఇలా చేసినవారే. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా సీఎం సీటులో కూర్చుకున్న కొన్ని రోజులకే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్‌లను నిలిపేసీ రాజన్నా క్యాంటిన్లంటూ కొత్తవాటిని ప్రారంబించారు. ఆఖరికి వాటిని కూడా సరిగా నిర్వహించలేదు. ఇలా మరెన్నింటివో పేర్లు మారాయి. దీంతో ఇప్పుడు జగన్ ప్రారంభించిన ‘విద్యా కానుక’ కీలకంగా మారింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ‘జగనన్న విద్యాకానుక’ పేరు అచ్చుతో వచ్చిన వస్తువులను పంపిణీ చేస్తారా? లేకుంటే వాటిని ఆపేసి కొత్తవాటికి ఆర్డర్ ఇస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై బాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు పాలనలో పగ, ప్రతీకారాలకు తావు ఉండదని టీడీపీ తమ అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. అందుకు ఈరోజు ‘జగనన్న విద్యా కానుక’ విషయంలో తీసుకున్న నిర్ణయం నిలువెత్తు నిదర్శనం అని తెలిపింది. జగనన్న బొమ్మ, పేరు ఉన్న విద్యాకానుక వస్తువులను యథాతథంగా పంపిణీ చేయాలని, విద్యార్థులు అవి సకాలంలో చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆధించారని పార్టీ ప్రకటించింది. విద్యార్థులకు అందించే ప్రతి వస్తువు నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదని, వారికి నాణ్యమైన విద్యను అందించాలని బాబు చెప్పారు.

మార్పులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తొలుత నుంచే పలు పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వెనకబడిందని, రాష్ట్రాన్ని మరోసారి అభివృద్ధి బాట పట్టించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన ఈరోజు తిరుమలలో వెల్లడించారు. ‘‘రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర ఖజానాలోని నిధులను రూపాయి కూడా దుర్వినియోగం చేయకూడదని నిశ్చయించుకున్నాం. అందుకే జగన్ ఫొటో, పేరు ఉన్నా విద్యాకానుక కిట్‌ను పంపిణీ చేయాల్సిందే తప్ప.. కిట్‌ను మార్చడానికి ప్రత్యేక నిధులు వెచ్చించొద్దని ఆదేశించారు చంద్రబాబు’’ అని టీడీపీ అధికారంగా వెల్లడించింది.

గతంలో ఇలా

‘‘గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. తమ చర్యల ద్వారా పేదల కడుపుకొట్టారు మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసలుకే తక్కువగా ఉన్న నిధులను ఆచితూచి వినియోగించాలన్న దూరదృష్టితో చంద్రాబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం ఇదే. బాబు పాలనలో పగ, ప్రతీకారాలు, కక్షసాధింపు చర్యలకు స్థానం ఉండదు.’’ అని టీడీపీ రాసుకొచ్చింది.

Read More
Next Story