ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌ సీరియస్‌
x

ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌ సీరియస్‌

ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు మచ్చ తెచ్చేలా ఈ ఎమ్మెల్యేల తీరు ఉందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


వివాదాస్పదంగా మారిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ సీరియస్‌ అయ్యారు. కేబినెట్‌ సమావేశానికి ముందు మంత్రి లోకేష్‌ దీని గురించి మంత్రుల వద్ద ప్రస్తావించగా, కేబినెట్‌ అనంతరం దీనిపై చర్చించిన సీఎం చంద్రబాబు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చేపనులు చేయొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. గురువారం మంత్రి వర్గ సమావేశానికి ముందు ఈ వివాదాస్పద ఎమ్మెల్యేల గురించి ప్రస్తావన వచ్చింది. మంత్రి నారా లోకేష్‌ మంత్రులతో దీని గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తీరుపైన మంత్రులతో కూడా చర్చించారు.

ఈ సందర్భంగా లోకేష్‌ చాలా సీరియస్‌ అయినట్లు సమచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్భన్‌ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కేజీబీవీ ప్రిన్సిపల్‌ సౌమ్యను వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డరానే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, మరో వివాదాస్పద ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ల గురించిన సంఘటనలు, చోటు చేసుకున్న పరిస్థితుల మీద మంత్రులతో నారా లోకేష్‌ చర్చించినట్లు తెలిసింది. జైల్లో జీవిత ఖైదీగా ఉన్న నెల్లూరు అరుణ ప్రియుడు శ్రీకాంత్‌ పెరోల్‌కు సంబంధించిన అంశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ల గురించి కూడా లోకేష్‌ చర్చించినట్లు సమాచారం.
ఈ ఏడుగురు ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు మచ్చ తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీరి వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఆగ్రంగా ఉన్నారనే విషయాన్ని కూడా మంత్రులతో షేర్‌ చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు నష్టం వచ్చే విధంగా ఎమ్మెల్యేల ప్రవర్త ఉంటే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని ఇది వరకే ఆ వివాదాస్పద ఎమ్మెల్యేలకు చేరవేసినట్లు తెలిసింది. పెరోల్‌ విషయంలో ప్రతి ఎమ్మెల్యే ఆచితూచి వ్యవహరించాలని ఎమ్మెల్యేలు, హోం మంత్రికి లోకేష్‌ సూచించారు. వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపులకు సంబంధించిన వస్తున్న ఫిర్యాదులను మంత్రులు లోకేష్‌ వద్దకు తీసుకెళ్లారు.. అర్హత ఉన్న వారికి ఎలాంటి నష్టం జరక్కుండా ప్రతి ఒక్కరికి పెన్షన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రులకు లోకేష్‌ హామీ ఇచ్చారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాల మీద సీఎం చంద్రబాబు కేబినెట్‌లో చర్చించారు. వివాదాస్పద ఎమ్మెల్యేల తీరు పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత దాడుతున్న ఎమ్మెల్యేల మీద ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
Read More
Next Story