కలుషిత ఆహారానికి ముగ్గురు చిన్నారులు మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
x

కలుషిత ఆహారానికి ముగ్గురు చిన్నారులు మృతి.. సీఎం దిగ్భ్రాంతి..

అనకాపల్లి కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసా తిని 27 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.


అనకాపల్లి కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసా తిని 27 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరిని ఆసుపత్రికి తరలించి ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు గుర్తించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈరోజు ఆ చిన్నారుల్లో నలుగురు మరణించారు. మృతి చెందిన విద్యార్థులను భవాని, శ్రద్ధ, నిత్య, జాషువాగా అధికారులు చెప్పారు. 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారికి అవసరమైన వైద్యం అందించడానికి వెనకాడొద్దని అధికారులకు సీఎం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి.

సీఎం, లోకేష్ దిగ్భ్రాంతి

అనకాపల్లి అనాథాశ్రమానికి చెందిన నలుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైని మిగిలిన విద్యార్థులను మెరుగైన వైద్యం అందించాలని, వారికి అందించే వైద్యం విషయంలో రాజీ పడొద్దని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, మిగిలిన విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

బాధిత విద్యార్థులకు పరిహారం

అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తీసుకోవడం కారణంగా మరణించిన నలుగురు విద్యార్థుల సంరక్షకుల ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఆశ్రమాలు, వసతి గృహాల్లో అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నారా లోకేష్‌కు సూచించారు చంద్రబాబు. చిన్నారులకు అందించే ఆహారం విషయంలో రాజీ పడొద్దని, వారికి నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్య అందించేలా చర్యలు చేపట్టాలని, వాటిని తక్షణం అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా సూచించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: జగన్

అనకాపల్లి ఫుడ్‌పాయిజన్ ఘటనపై మాజీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథాశ్రమాల్లో సరైన పర్యవేక్షణ లేకుండా పోయిందనడానికి ఈ ఘటన ఉదాహరణ అని, చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకైనా మెరుగైన వైద్యం అందించాలని జగన్ కోరారు. అంతేకాకుండా కూటమి సర్కార్ ఇకనైనా గత ప్రభుత్వం బురద జల్లడం, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకుని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

Read More
Next Story