మాటల్లో పదను.. చేతల్లో చేవ పవన్ కల్యాణ్ సొంతమన్న చంద్రబాబు
x

PAWAN KALYAN & CHANDRABABU

మాటల్లో పదను.. చేతల్లో చేవ పవన్ కల్యాణ్ సొంతమన్న చంద్రబాబు

‘‘పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం అనిచంద్రబాబు ప్రశంసలు


జనసేన పార్టీ అధ్యక్షుడు, డెప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇవాళ (సెప్టెంబర్ 2) జన్మదినోత్సవ శుభాకాంక్షల వర్షం కురిసింది. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు నారా లోకేశ్ వరకు, రాష్ట్ర మంత్రుల మొదలు కుటుంబ సభ్యుల వరకు, ప్రముఖ నటుడు చిరంజీవి నుంచి సామాన్య కార్యకర్తల వరకు పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూల వర్షం కురిపించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం.. జన సైన్యానికి ధైర్యం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలి.. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది’’ అని చంద్రబాబు అన్నారు.ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు.
పవన్‌ పీపుల్‌స్టార్‌: నారా లోకేశ్‌
వెండితెరపై అభిమానులను పవన్‌ కల్యాణ్‌ పవర్‌ స్టార్‌గా అలరించారని మంత్రి లోకేశ్‌ అన్నారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్‌గా ఎదిగారని కొనియాడారు. ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని ప్రశంసించారు. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తనను పవన్‌ అభిమానిస్తారన్నారు. అండగా నిలుస్తున్న పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని లోకేశ్‌ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ కు ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు.
Read More
Next Story