Mohanbabu and Manoj|మోహన్ బాబు, మనోజ్ ను విచారిస్తున్న పోలీసులు
x

Mohanbabu and Manoj|మోహన్ బాబు, మనోజ్ ను విచారిస్తున్న పోలీసులు

ఇద్దరిలో ఎవరు ఎవరిపైన దాడిచేశారు ? ఎవరినుండి ఎవరికి ప్రాణహాని ఉందన్న విషయం అర్ధంకాక సినీ ప్రముఖులు, అభిమానులు జుట్లు పీక్కుంటున్నారు.


మంచుఫ్యామిలీ వివాదాలు బాగా ముదిరిపోయాయి. మోహన్ బాబు, చిన్నకొడుకు మంచు మనోజ్ ఇద్దరిపైనా పహడీ షరీఫ్ పోలీసులు కేసులు నమోదుచేశారు. కారణం ఏమిటంటే తండ్రి, కొడుకులు ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటమే. తనింటిమీద దాడిచేసి తండ్రి, ఆయన మద్దతుదారులు దాడిచేశారని మంచు మనోజ్(Manchu Manoj) చేసిన ఫిర్యాదుపైన పోలీసులు మోహన్ బాబు(Manchu MohanBabu)తో పాటు మరో ఇద్దరిపైన కేసులు నమోదుచేశారు. ఇదే సమయంలో తన కొడుకు నుండి ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయటంతో పోలీసులు మనోజ్, మౌసిక(Mounika)పైన కూడా కేసు బుక్ చేశారు. దాంతో మంచుకుటుంబంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు.

అసలు ఇద్దరిలో ఎవరు ఎవరిపైన దాడిచేశారు ? ఎవరినుండి ఎవరికి ప్రాణహాని ఉందన్న విషయం అర్ధంకాక సినీ ప్రముఖులు, అభిమానులు జుట్లు పీక్కుంటున్నారు. సినీఫీల్డులో మంచుఫ్యామిలీ(Manchu Family)కి బాగా సన్నిహితంగా ఉన్నవారికి కూడా వాళ్ళింట్లో ఏమి జరిగిందో అర్ధంకాక దిక్కులు చూస్తున్నారు. ఇద్దరిమధ్యా సయోధ్యచేయాలన్నా ఎవరుచెబుతున్నది నిజమో అర్ధంకావటంలేదు. మంచు కుటుంబానికి బయటవారికి ఎవరికైనా వివాదం రేగితే సులభంగానే సయోధ్య కుదిరే అవకాశముంది. కానీ ఇపుడు గొడవలు జరుగుతున్నది, ఫిర్యాదులు చేసుకున్నది, కేసులు బుక్ అయ్యింది స్వయంగా తండ్రి, కొడుకులు మోహన్ బాబు, మనోజ్ మీదే కావటంతో సన్నిహితులకు ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. కాలు, మెడపైన గాయాలు అయినట్లు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ ను మనోజ్ పోలీసులకు చూపించి మోహన్ బాబు మీద కేసు పెట్టాడు. ఇదే సమయంలో మనోజ్ నుండి ప్రాణహాని ఉందని చెప్పి వాట్సప్ ద్వారా ఇచ్చిన ఫిర్యదు ఆధారంగా కేసు నమోదుచేశారు.

ఇదేవిషయమై రాచకొండ పోలీసుకమీషనర్ గొట్టె సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతు మోహన్ బాబు వాట్సప్ లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మనోజ్ మీద కేసు నమోదుచేసినట్లు చెప్పారు. తనకు గాయాలు అయినట్లు డాక్టర్ సర్టిఫికేట్ చూపించి స్వయంగా మనోజ్ పోలీసుస్టేషన్ కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మీద కేసు నమోదుచేసినట్లు పోలీసు కమీషనర్ చెప్పారు. ఇద్దరి మీద కేసులు నమోదుచేసిన పోలీసులు ఇద్దరి ఇళ్ళకు వెళ్ళి విచారణ మొదలుపెట్టారు. మనోజ్ తరపున కొందరు బౌన్సర్లు, దుబాయ్(Dubai) లో ఉన్న పెద్దకొడుకు విష్ణు(Manchu Vishnu) పంపిన మరికొందరు బౌన్సర్లు జల్ పల్లి ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకోవటంతో అక్కడంతా ఆదివారం సాయంత్రం నుండి పరిస్ధితి ఉద్రిక్తంగా ఉంది. ఇళ్ళ దగ్గర, ఫామ్ హౌస్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కాపలా ఉన్నారు.

చాలాకాలంగా మంచు ఫ్యామిలీ ఆస్తుల పంపకాలు, విద్యాసంస్ధల్లో ఆధిపత్యం విషయంలో సోదరుల మధ్య పెద్ద గొడవలే అయ్యాయి. ఆ గొడవల్లో మోహన్ బాబు పెద్దకొడుకు విష్ణుకు మద్దతుగా నిలిచినట్లు మనోజ్ ఆరోపిస్తున్నాడు. అప్పటినుండే తండ్రి,కొడుకుల మధ్య కూడా విభేదాలు మొదలై బాగా పెరిగిపోయినట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే ఇన్ని విభేదాలున్నా నాలుగు నెలల క్రితంవరకు తండ్రి, కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకోవటంతోనే మనోజ్ ఇంట్లోనుండి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. తండ్రి, సోదరుడు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు, నమోదైన కేసుల నేపధ్యంలో దుబాయ్ నుండి విష్ణు మంగళవారం ఉదయం హైదరబాదుకు చేరుకున్నాడు. కూతురు లక్ష్మీప్రసన్న(Manchu Lakshmi Prasanna) ఇప్పటికే ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నది. మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత ఇంట్లో గొడవలు బాగా పెరిగిపోయాయని మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగా అర్ధమవుతోంది. ఇద్దరి మీద కేసులు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు చివరకు ఏమి తేలుస్తారనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

Read More
Next Story