మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై కేసు
వైఎస్ఆర్సీపీ నేతలపై వరస కేసులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మేరుగ నాగార్జునపై ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.
మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 90లక్షలు తీసుకొని మేరుగ నాగార్జున మోసం చేశారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఐ కల్యాణ్రాజ్కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన వద్ద తీసుకున్న రూ. 90లక్షలను తనకు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జునను అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో గిరిజన టీచర్ను స్లో పాయిజన్ ద్వారా చంపేశానని, నీకు అదే గతి పడుతుందని మేరుగ నాగార్జున వ్యక్తిగత సహాయకుడు మురళీ తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, మేరుగ నాగార్జున తనకు ఇవ్వాల్సిన రూ. 90లక్షలను తనకు ఇప్పించాలని పోలీసులను ఆ మహిళ కోరారు.
Next Story