అక్టోబర్‌ 14న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
x

అక్టోబర్‌ 14న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

విజయవాడ కనక దుర్గమ్మ దేవి నవరాత్రుల సందర్భంగా అక్టోబరు 14 సోమవారం పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రద్దు చేశారు.


విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కనక దుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధులలో ఉంటారు. అందువల్ల ఈ నెల14 వ తేదీ సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసల్‌ సిస్టం) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీ సృజన తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని అర్జీదారులను ఆమె కోరారు. ఈ కార్యక్రమం రద్దైన నేపథ్యంలో అక్టోబరు 14 వ తేదీ సోమవారం ఫిర్యాదుల పరిష్కారం కోసం అర్జీలు తీసుకోబడవని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అర్జీదారులెవ్వరూ ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రమైన విజయవాడ కలెక్టరేట్‌కు రావద్దని జిల్లా కలెక్టర్‌ జీ సృజన పేర్కొన్నారు.

Read More
Next Story