ఏపీ బిజెపిలో సందడి
x

ఏపీ బిజెపిలో సందడి

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీలో సందడి మొదలైంది. ఎప్పుడూ లేని విధంగ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలవడంతో ఈ సందడి మొదలైంది.


బిజెపి నుంచి ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం వల్ల రాష్ట్ర కార్యాలయం నిత్యం సందడిగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కళకళలాడుతోంది. బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎక్కువ సమయం పార్టీ కార్యాలయంలోనే గడుపుతున్నారు. ఆమె రాజమహేంధ్రవరం నుంచి ఎంపీగా గెలుపొందినందున నియోకరవర్గ నాయకులతో కలిసి మాట్లాడుతున్నారు.

నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి దగ్గుబాటి పురందేశ్వరిలు గెలుపొందారు. పురందేశ్వరికి పార్లమెంట్‌ స్పీకర్‌ పదవి ఇస్తారనే ప్రచారం సాగుతుండటంతో మరింత సందడి కార్యాలయం వద్ద మొదలైంది.
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పది మంది పోటీ చేస్తే ఎనిమిది మంది గెలవడం వివేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బీజెపీ అభ్యర్థులు గెలిచారు. కూటమి ద్వారా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు చీలకుండా బిజెపికి పడటంతో ఎమిది మంది విజయం సాధించారు. గెలిచిన వారిలో విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి, సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి వై సత్యకుమార్‌ యాదవ్, ఏలూరు జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, కడప జిల్లా జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణరెడ్డి, విశాఖ నార్త్‌ నుంచి విష్ణుకుమార్‌రాజు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఎస్‌ ఈశ్వరరావు, కర్నూలు జిల్లా ఆదోని నుంచి డాక్టర్‌ పార్థసారధి, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు గెలిచారు. వీరిలో వై సత్యకుమార్‌ యాదవ్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గెలవగానే ఎమ్మెల్యేలందరూ బీజెపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి అధ్యక్షురాలుతో పాటు ఆఫీస్‌ బేరర్స్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలోని నాయకులు వారికి సాదరంగా స్వాగతం పలికి అభినందించారు.
ఏపీలో వేళ్లూనుకుంటున్న బిజెపి
ఇప్పటి వరకు బిజెపి పొత్తులో తప్ప సొంతంగా ఏపీ నుంచి గెలవలేదు. ఈ సారి పొత్తులో గెలిచినా ఎక్కువ మెజారిటీలు రవడం విశేషం. కూటమి ఓటు చీలకుండా అనుకున్న ప్రకారం పార్టీల అభ్యర్థులకు వేశారు. దీంతో ఆయాఆ పార్టీల నుంచి కూటమి తరుపున పోటీ చేసిన వారు ఎక్కువ మంది గెలిచారు. పది మందిలో ఎనిమిది మంది గెలవడం అంటే ఆషామాషీ కాదనేది పలువురు రాజకీయ మేధావులు చెబుతున్న మాట. ప్రస్తుతం కమ్యూనిస్టులకు సైతం చోటు దక్కని అసెంబ్లీలో ఏపీ నుంచి బిజెపి వారికి చోటు దక్కడంతో ఎలాగైనా ఆ నియోకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో బిజెపి వారు ఉన్నారు. పైగా మంత్రి కూడా ఉన్నందున పార్టీకి విస్తృతమైన సహకారం అందించే వీలు ఉందని, అందువల్ల ఎలాగైనా పార్టీని అన్ని నియోజకవర్గాల్లో వేళ్లూనుకునేలా ఈ ఐదేళ్లలో చేయాలనే ఆలోచన పార్టీ పెద్దల్లో వచ్చింది. కేంద్రంలోనూ బిజెపి ప్రబుత్వమే ఉన్నందున కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాల కల్పనలో తామే ముందుండి చేయించాలనే ఆలోచనలో బిజెపి వారు ఉన్నారు.
అవినీతిని బయటపెడతాం
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అవినీతిని బయటపెడతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అధికారం అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ వారు దోచుకున్నారని, దర్శనాలు వారి ఇష్టానుసారం ఎవరికంటే వారికి అవకాశం ఇచ్చి సామాన్య భక్తులను నానా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ఇవన్నీ బిజెపి ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి అవినీతిని వెలికి తీసేందుకు జుడీషియల్‌ కమిటీని వేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణం దేవుడి సొమ్ము తినడమేనని సెంటిమెంట్‌తో కొట్టారు.
Read More
Next Story