‘జగన్.. తానో సైకో అని నిరూపించుకున్నారు’..మండిపడ్డ బుద్దా వెంకన్న
x

‘జగన్.. తానో సైకో అని నిరూపించుకున్నారు’..మండిపడ్డ బుద్దా వెంకన్న

వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ ఇప్పటికీ పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. త్వరలోనే జగన్ జైలుకు వెళ్తారని జోస్యం కూడా చెప్పారు.


ఎమ్మెల్సీలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చి పిలుపుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. తన చర్యలతో తానో సైకో అని జగన్ మరోసారి నిరూపించుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆనాడు అమరావతిని చంపడానికి అన్న విధాలా ప్రయత్నించిన జగన్.. చివరికి శాసనమండలిని కూడా రద్దు చేయడానికి వెనకాడలదేని, కానీ రాజ్యాంగ బద్దంగా అది సాధ్యం కాలేదని గుర్తు చేశారు. అటువంటి ఇప్పుడు ఐదేల్లు కళ్లుమూసుకుంటే మరోసారి అధికారం తమ చేతికి వస్తుందని పగటి కలలు కంటున్నారంటే చురకలంటించారు.

జగన్ మాటలు విడ్డూరం

ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత విడ్డూరంగా ఉన్నాయని బుద్దా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సుభిక్ష పాలన సాగించిన మన ఐదేళ్ల పాలన ఎప్పుడు పూర్తయిందో కూడా అర్థం కాలేదు. అదే విధంగా ఇప్పుడు కూడా కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లు పూర్తవుతాయి. మళ్ళీ మనకే అధికారం వస్తుంది’’ అని విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్నా. అంతేకాకుండా అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా కళ్లు మూసుకునే కదా జగన్ ఉంది అంటూ సెటైర్లు వేశారు. ‘‘ఆంధ్ర ప్రజలకు తానేదో సుభిక్షమైన పాలన అందించానని జగన్ చెప్పుకుంటున్నారు. కానీ ఆయన పాలన తట్టుకోలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దాన్ని మరిస్తే ఎలా. ఇప్పటికి కూడా జగన్ భ్రమలోనే బతుకుతున్నారు’’ అని విసుర్లు విసిరారు.

పోటీకే అర్హత ఉండదు

నాయకులు, క్యాడర్ వెళ్లిపోతుందేమో అన్న భయంతో జగన్ వణికిపోతున్నారని, వారిని కాపాడుకోవడానికి ఇలాంటి కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘అసలు ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో జగన్‌కు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు ఆయన. జగన్ అంటే ఎంతో అభిమానించే, ఇష్టపడే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదో ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ విషయం వైసీపీ కార్యకర్తలకు కూడా బాగా అవగతం అయిపోయింది. అందుకే తాము వైసీపీ అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు’’ అని జగన్‌పై ధ్వజమెత్తారు.

పింఛన్ విషయంలోనూ అంతే

ప్రతి విషయాన్ని రాజకీయంగా తన లబ్ది కోసమే వినియోగించుకున్న ఏకైక నేత జగనే అంటూ కితాబు కూడా ఇచ్చారు బుద్దా వెంకన్న. ఆఖరికి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్‌ను కూడా తన స్వార్థ రాజకీయాల నుంచి మినహాయించలేదని మండిపడ్డారు. ‘‘పింఛన్ విషయంలో జగన్ ఎంతో రాజకీయం చేశారు. ఆఖరికి ఎన్నికల ముందు నెలల్లో కూడా వారికి ఇచ్చే పింఛన్లతో నీచ రాజకీయాలు చేసి ఎందరో వృద్ధుల ప్రాణాలు తీశారు. కానీ చంద్రబాబు మాత్రం చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన వెంటనే పింఛన్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఈ పెరుగుదలను ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఈ మూడు నెలలు రావాల్సిన అదనపు వెయ్యి రూపాయాలను కలిపి జూలైలో మొత్తం రూ.7 వేల అందిస్తామని కూడా స్పష్టం చేశారు’’ అని చెప్పారు.

అప్పుల ప్రదేశ్ ఘనత జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చిన ఘనట వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ‘‘అధికారంలోకి రావడానికి ముందు ప్రతి ఏడాదికి పింఛన్‌ను రూ.250 పెంచుతానని చెప్పారు. అది చేయలేదు. ప్రత ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారూ అది కానరాలేదు. కొత్త కంపెనీలు అన్నారు.. రాష్ట్రం నుంచి వెళ్లే తప్ప వచ్చినవి ఒక్కటీ లేదు. సంపద సృష్టించడం చేతకాని జగన్.. ఆదర్శ ప్రదేశ్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది చంద్రబాబుకు బాగా తెలుసు

‘‘ఆంధ్రప్రదేశ్‌ను మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలో చంద్రబాబుకు తెలుసు. సంపద సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున వంద దేశాల్లో పోరాటాలు జరిగాయి. కానీ నిన్ను అరెస్ట్ చేస్తే ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోరు. నిన్ను ప్రజలే కాదు అయినవారు కూడా ఛీ కొడుతున్నారు. ఆఖరికి నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటమికి జగన్ ప్రవర్తనే కారణమని బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో ఓడిపోయినా ప్రజలల్లో నిలిచి వారి సమస్యలపై పోరాడిన నేతలు టీడీపీ నాయకులు. కానీ మీ వైసీపీ నేతలు మాత్రం ఓడిపోయిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రం, ప్రజలతో మాకు సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు’’ అని మండిపడుతున్నారు.

ప్రజలు ఊరుకోరు

‘‘వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి చాలా మంది అధికార అహంకారం తలకెక్కి చంద్రబాబును ఇష్టారాజ్యంగా మాటలు అన్నారు. ఇప్పుడు మాకు అధికారం వచ్చినా పగలు, ప్రతీకారాలు వద్దని చెప్తున్న పెద్దమనిసి చంద్రబాబు. ఏదైనా చట్టపరంగా వెళ్లాలని చెప్తున్న మంచి మనిషి ఆయన. వంశీ వ్యాఖ్యలకు చంద్రబాబు యాక్షన్ తీసుకోకపోయినా.. ప్రజలు ఊరుకోరు. ఇంతకు మించిన దెబ్బ కొడతారు. జగన్ జైలుకు వెళ్లడం.. వైసీపీ భూస్తాపితం కావడం అతి త్వరలో జరుగుతాయి’’ అని హెచ్చరించారు.

‘సైకో అని నిరూపించుకున్నావు’

చంద్రబాబు, నారా లోకేష్, చంద్రబాబులను నోటికి వచ్చినట్లు మీ నాయకులు బూతులు తిడుతున్నా వారిని అడ్డుకోవాలన్న ఇంగితం కూడా లేని నాయకుడు జగన్ మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. ‘‘బూతులు మాట్లాడుతున్న నాయకులను వారించకపోగా సైకో తరహాలో నవ్వుతూ వారిని ప్రోత్సహించావు. నీ పాలన నచ్చకనే మీ ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలకన్నా ముందే బయటకు వచ్చేశారు. నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. చేసిన తప్పుకు శిక్ష తప్పదు. అధికారం ఉందన్న అహంకారంతో అందరూ రంకెలు వేశారు. కానీ ప్రజలు వేరేలా తీర్పు ఇచ్చారు’’ అని అన్నారు.

‘నేనే పిల్ వేస్తా’

‘‘ఇన్నాళ్లూ ఎన్ని కేసులు ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్.. కోర్టుకు కూడా వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఆయన కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని తానే స్వయంగా పిల్ వేస్తా. ఒక్కసారి విచారణ మొదలైతే జైలుకు వెళ్లడానికి జగన్ సిద్ధంగా ఉండాలి. అయినా ప్రజల్లో లేని నీకు ఆయనకు ఇల్లు, జైలుకు తేడా ఏముంటుంది’’ అని చురకలంటించారు బుద్దా వెంకన్న.

Read More
Next Story